Saturday, March 28, 2009

నా నిరీక్షణా...!

కనులు నీకై కలలు కంటుంటే,
మనసు నీకోసం మల్లెల మంచం సిద్దం చేస్తుంటే,
తలపులు హృది తలుపులు తెరిచి నీ రాకను స్వాగతిస్తుంటే,
కొత్త పెళ్లి కూతిరివై నా వలపు వాకిటిలో అడుగేట్టే క్షణాల కోసమే నా నిరీక్షణా...!

నీరాకను స్వాగతిస్తూ... నీకై నిరీక్షిస్తూ..

వలపుల మడిలో తలపుల తడితో,
ఆశల పంట వేసి ఊహాల పూలు పూయించి,
నీ సుకుమార పాదాలు కందకుండ నా హృది గుడికి
దారంతా పరిచాను నీరాకను స్వాగతిస్తూ... నీకై నిరీక్షిస్తూ...!

నీ మీద నా ప్రేమ..!

నా కవిత పదాల పొందికలో నీ కులుకులు దాచుకున్న,
నా కను పాపలలో నీ రూపు దాచుకున్న,
నా కన్నుల వెలుగులలో నీ చిరునవ్వులు దాచుకున్న,
నీ తలపులన్ని నా ఆలోచనలో దాచుకున్న,
నీ తీపి విరహాలు నా నిరీక్షణలో దాచుకున్న,
నీ చిలిపి తగవులు నా చిరునగవులలో దాచుకున్న,
ఇన్ని దాచగలిగిన, నీ మీద నా ప్రేమను దాచలేకపోతున్న....
దాచలేనంత ఆ ప్రేమను నీకే దోచిపెడుతున్న.....!