సృష్టిలోని ప్రతి జీవికి మొదటి స్ఫూర్తి నాన్న...
ఆ స్ఫూర్తి నడిపే దారిన వెలుగులు నింపే...
ఆరని దీపం అమ్మ!!
అమ్మంటే ఆశావాదం...
నాన్నంటే నడిపే పాదం!!
అమ్మ నేలైతే... నాన్న నింగైతే...
వారి ప్రేమలో పండిన పసిడి పంటలు మేమంటా!!
నిద్దురపుచేందుకు అమ్మ పాడే జోల పాట...
ఆ అమృతంకన్న మిన్న!!
ఎదిగే వయసుకు నాన్న చూపే బాట....
జీవితపు ఆటలో గెలుపును తెచ్చే పూదోట!!
మా మనసు కలత చెందితే కన్నీళ్ళు ఆ కళ్ళలో...
మా ఆనందంలో తమ ఆనందం వెతుకుంటూ...
వారికంటూ ఏమి చూసుకోక...
ప్రతిక్షణం మా కోసం పరితప్పించే ఆ త్యాగజీవులకు...
ఏమిచ్చి తీర్చగలను... ఈ ఋణం!!
ఇది ఆ వరాలిచ్చే దేవుడైన పొందలేని ఒక గొప్ప వరం!!
శతకోటి దేవతల ఏకరూపు మా అమ్మానాన్నలు...
వారిని నిత్యం పూజించే పూజారిని నేను...
విడిచి దూరంగా వెళ్ళలేను!!
అలాంటి అమృతమూర్తులకి...
అవసాన దశలో అమ్మనాన్నని నేనౌతా!!
వయసు తెచ్చే వైరాగ్యపు చీకట్లను తరిమే...
అశాదీపపు వేకువ వెలుగును నేనౌతా!!
సత్తువుడిగి... కదల్చలేని పాదాలకు...
కదలిక తెచ్చి నడిపించే మూడోపాదం నేనౌతా!!
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
vrudhapyam lo...vunna thalli thandrulanu karkasha manasutho vrudhasramalallo vadili vesthunna prathi okkaru... siggupadeela.... ammaa naanna la goppadananni.. challa chakkaga vivarinchav.......gud gud
Post a Comment