Saturday, September 26, 2009

వెదికే నయగారం... వరసై వచ్చిన వేళ!!

వెదికే నయగారం...
వరసై వచ్చిన వేళ...
మనసే మల్లెల హారం...
వయసే వెన్నెల తీరం...

మెరిసే కన్నులలోన...
విరిసే వలపుల కోన!!
మురిసే మదిలోన...
మెదిలే తలపులు చాన!!
అరెరే అనుకున్న...
ఆగిమరిచూస్తున్న!!
ఈ సంగతేంటో ఇలా..
కొత్తగుంది నాలోన!!

ఇది నీవల్లే అనుకున్న.. నీకే నే లొంగిపోతున్న!!
అగలేకపోతున్న... అడ్డుచెప్పక నిల్చున్న!!
తిగల్లె నన్ను అల్లెస్తావో... వరదల్లె ముంచేస్తావో...
అది నీకే వదిలేస్తున్న... నన్ను నీకు అర్పిస్తున్న!!

ఎదసవ్వడి

పలికినది ఎదసవ్వడి తనతోనే లోకమని!!
మురిసినది మది ఆ ఎద అన్నది విని!!
నిలిపినది హృది గుడిలో తన చిరునవ్వుల ప్రతిమని!!
విరిసినది పువ్వుల వని మనసున తననుగని!!
చేరినది తలపుల చెంతకు తనతో సరదాగా సాగమని!!
వలచినది... తనకై వగచినది,తనను చేరే క్షణాలు పెరిగేకొద్ది!!

Friday, September 25, 2009

ఘనీభవించిన స్నేహపు మేఘాన్ని నేను...

మేఘాలు ఉరుముతున్నాయి... కాని వాన లేదు!!
గుండె కొట్టుకుంటుంది... కాని చప్పుడు లేదు!!
పెదవులు కదులుతున్నాయి... కాని పలుకు లేదు!!
ఒంట్లో ఉసురుంది.. కాని ఉలుకు లేదు!!
గడిచిన రోజులో ఎ ఒక్కక్షణం కూడా...
నన్ను జ్ఞప్తికి తేలేదా... మిత్రమా!!

ఘనీభవించిన స్నేహపు మేఘాన్ని నేను...
నీ నులివెచ్చని చెలిమిలో కరిగించు...
వానై కురుస్తాను... ఆనందపువరదనౌతాను!!
శూన్యంలో చూడకు నేస్తమా... ఆ కొట్టుకునే గుండె చప్పుడు వినిపించదు...
ఆ హృది అట్టడుగు పొరల్లో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాల గనిని త్రవ్వి చూడు...
అది చేసే చప్పుడు ఎంత మదురమో!!
కదిలే పెదాల నరాలను తాకిచూడు...
స్వాంతన స్వరాలను మీటుతాయి... స్నేహపుగీతాన్ని ఆలపిస్తాయి!!
ఉలుకు లేదని నువ్వు ఉస్సురుమంటున్న... నీ ఉశ్చ్వాస నిశ్వాసల కదలికలలో నేనున్నా!!
నిన్ను క్షణమైనా మరిస్తే కదా మిత్రమా... మరల గుర్తు చేసుకునేది!!
గతించిన క్షణాల్లోనే కాదు... గమిస్తున్న క్షణాల్లోనూ...
ప్రతిక్షణం నా తలపులలో... అనుక్షణం నా ఆలోచనలలో...
నేను ఒంటరిని కాదంటూ తోడై ఉనావు!!
నే వేసే ప్రతి అడుగుకు విరుల త్రోవైనావు!!

నా దేవేరి నవ్వింది!!

మదనపడే మగతవిడే...
మరులుగోల్పే విరులు చేర్పే..
వడివడి నడకలలో నాట్యం చేరే..
తరుణం వచ్చింది!!
తగువులు తెంచింది!!
తమకం పెంచింది!!

అరుణం అలక వీడింది!!
సంబరం అంబరమంటినది!!
తామరం తలపుల దేవతకు తర్పణమైంది!!

కథై... కవితై...
కలలకు నెలవై...
మది మురిసింది!!
మనసు మందిరాన నా దేవేరి నవ్విన క్షణాన!!

Sunday, September 20, 2009

జీవుడి గమనం!!

జననం భువనం... మరణం గగనం ఐతే...
ఆ రెంటి నడుమ...
ఎంతో పయనముంది... మరెంతో ప్రయాసవుంది!!
ఎంతో జీవనముంది...ఇంకెంతో జీవితముంది!!
ప్రేమలున్నాయి... పోరులున్నాయి!!
కష్టాలున్నాయి... సుఖాలున్నాయి!!
కలతలున్నాయి... కన్నీళ్ళున్నాయి!!
బ్రతుకులున్నాయి... భవితలున్నాయి!!
విటన్నిటిని పెనవేసి...
ఆ చావు-పుట్టుకలను కలిపే సన్నని జీర...
ఈ జీవుడి గమనం!!

ఆరు చక్రాల బండిలో బ్రహ్మమును చేరే దిశలో...
అరిషడ్వర్గాలతో పోరు సలిపి...
వాటికి లొంగిన బీరులు,
బ్రతికున్న విగత జీవులు... గమ్యం మరిచిన గ్రుడ్డి ప్రాణులు!!
వాటినే లొంగదీసిన వీరులు, ధీరులు...
మరణంలోనూ అమరం పొందే దైవులు!!
బ్రహ్మముతో ఐక్యమయ్యే బ్రతుకు జీవులు!!
పరమాత్మలో లీనమైయ్యే అత్మరాములు!!

నా తరళేక్షణ కై అన్వేషణ!!

వయసొచ్చి విరిసిన మనసుని, ముదమున మదనుడు విసిరిన విరుల శరము తగిలినవేళ నుండి...
కవితాసీమలో కలల కౌముదిలో కదిలిన కలహంస చిత్రం!!
ఊహల ఊయలలో ఊరేగిన ఊపిరి ఊహా చిత్రం!!
మగతలో వున్నా మనసుకి మరో జగంలో మెదిలిన మనోజ్ఞ చిత్రం!!
ఆ చిత్త్తరువు చిత్తగించి...
ఇలలో తనకై సాగింది అన్వేషణ ఆ వేళ నుండే..!!

ఆ అన్వేషణలో...
తనకై పరిగెడుతున్న మనసుని పోదివిపట్టలేక పోగొట్టుకున్న!!
వినని మనసుని విడువలేక విచ్చిన్నమౌతున్న!!
ఆ మనసుకై వెదుకాలో... అది వెదికే నా తరుణీ కై వెదుకాలో..
తెలియని సంకట సందిద్గస్థితి!!
ఇరువిరి అన్వేషణ ఇరుకున పెడుతున్న...
ఊరించే ఉడుకు ఊహలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న...
ఏకాకి ఎద ఏకాంతపు వలలో గిలగిలాడుతున్న...
ఒంటరి వయసుని వలపుతలపులు వేదిస్తున్న..
ఆగలేదు... ఆపలేదు...
నా తరళేక్షణ కై అన్వేషణ!!

వేకువ తొలి వెలుగులలో ఆమె జిలుగులు వెదుకుతున్న!!
చీకటి మినుగురుల మినుకువలలో ఆమె కన్నుల కాంతులు వెదుకుతున్న!!
ఆమని ఆగమనం లో ఆమె గమనం వెదుకుతున్న!!
ఆ కడలి కదలికలలో ఆమె నడకలు వెదుకుతున్న!!
సెలయేటి ఆనకట్టులో ఆమె చీరకట్టును వెదుకుతున్న!!
నిశిరాతిరి నీడలో... నిరాచారినై నిరూపణలేని ఆమె రూపునకై వెదుకుతున్న!!
నింగి నిర్జరుడు నిర్దయుడైన... నిర్గమించక...
వేల కోట్ల తారలలో ఆమె తలపుల సితారలకై వెదుకుతున్న!!
నయాగర నడకలలో ఆమె నడుము నయగారముకై వెదుకుతున్న!!
మాఘమాసపు మల్లెల తోటలో ఆమె మేని పరిమళముకై వెదుకుతున్న!!
చలికాలపు చల్లని రేయిలో ఆమె వెచ్చని ఊపిరులకై వెదుకుతున్న!!
ఎంత వెదికిన తెలియకుంది ఎడుందో యా తరుణీ...
ఐన నిదురలేక... మరుపురాక వెదుకుతున్నఆ తరుణంలో...
నాకోసమే వెదుకుతూ వరసై, వదువై వస్తున్న తనని చూసి నిశ్చేష్టుడనవుతున్న!!

Friday, September 11, 2009

మహొన్నతునికి నా కవితాశ్రునివాళి

మరణం కాదది మానవీయతను వీడి మహానీయతను పొందిన యోగమది!!

మరణం కాదది మానసికంగా మనలో అమరం పొందిన బోగమది!!

జనం కొరకు జగం విడిచి జగద్దల్లిని చేరి వరములు కోర తన జీవమునే ముడుపుగట్టుకేల్లిన త్యాగమది!!

స్థూల దేహమున మనలను వీడిన, సూక్ష్మ దేహమున సుస్థిరుడై మనలను నడిపే త్రోవ తానైన తత్వమది!!

భౌతికంగా ఇలను విడిచిన, అభౌతికమై జనుల గుండెల్లో కొలువుదీరిన ప్రత్యూషాశేఖరుడు!!మన రాజశేఖరుడు!!

ఆ మహొన్నతునికి ఇదే నా కవితాశ్రునివాళి!!

ప్రేమ తీరు

ప్రేమ... ఓ ప్రేమ...
ఏమనుకోను... నీ తీరేమనుకోను...!!

గలగలా పారే సేలహేరు అనుకోనా!!
గుండెలోని గమ్మత్తైన గిలిగింతకు పేరు అనుకోనా!!
నీ కన్నా లోకాన ఇంకెవరూ లేరు అనుకోనా!!
ఎద మడిలో వేసిన తలపుల నారు అనుకోనా!!
వయసొచ్చి తెచ్చిన జోరు అనుకోనా!!
మగతై వచ్చి ముంచిన హొరు అనుకోనా!!
ఉడుకు ఊహాల్లో ఊరేగించే తేరు అనుకోనా!!
కనిపించని ప్రాణానికి మారు అనుకోనా!!
మతికి మనసుకి మద్య పోరు అనుకోనా!!
ఊపిరిలో చేరిన వెచ్చని ఊసుల ఊరు అనుకోనా!!

ఏమనుకోను... నిన్నేమనుకోను...!!