Monday, March 29, 2010

నా ఆత్మ గురువు నిజ దర్శనంపొందిన వేళ...

ఏకలవ్యుణ్ణి కాకపోయినా...
ఏకమనసున తనను నిల్పి...
దృష్టి పథమున... తన పదమును చేరి...
అక్షరాల అల్లికలలో... భావాల బంగిమలను కూర్చే...
మెలుకువలు నేర్చుకుంటున్న నాకు...

మహాత్ బాగ్యమై...
నా ఆత్మ గురువు నిజ దర్శనంపొందిన వేళ...
అందని ఆకాశాన్ని చేరి...
అంతులేని అనందాన తేలి...
మురిసే మనసు మౌనాన...
పుట్టిన ప్రతి అక్షరం... ఓ కుసుమమై...
తన పాదాలను అలంకరిస్తున్నాయి!!

ఇన్నాళ్ళు నాలో నన్ను కలవరపెట్టిన...
ఎన్నో ప్రశ్నలు ముడులు విప్పుకొని....
ముంగిట నిల్చుంటే మాటలు లేక...
మౌనంగా వాటిని మనసున పదిలంగా దాచుకున్న!!
తెలియని ఉద్వేగాన...
తీరని సందేహాన...
తికమక నడకలతో...
కవితావనంలో దిక్కుతోచక...
తిరుగుతున్న నాకు...
దిశను తెలిపిన దూర్జటి తానూ!!

తన మాటలు మహిమలు...
నా మనసున పని చేస్తున్నాయి...
జగమంతా కుటుంబం నాదని...
ఏకాకిని కాదని...మనసుకి ఏకాంతమే వరమని!!
చెపుతున్నాయి!!

No comments: