Monday, November 30, 2009

నీ లోక రాకను మరువకే మనసా!!

జగత్తు మహత్తు ఎరుగవే మనసా!!
ఎరిగిన ఎరుకను ఏలవే మనసా!!
ఏలిన ఎరుకను విడువవే మనసా!!
బయలుకు బాటను వేయవే మనసా!!

ఆహామునిడిచి ఇహ మందునాశ నొదిలి...
నీ దేహమందున్న ఆ దేహిని కనుగొనవే మనసా!!
ఆ బ్రహ్మమందునే పరబ్రహ్మముందని తెలియవే మనసా!!

లోకమాయలో మునిగి తేలి...
నీ లోక రాకను మరువకే మనసా!!

ఆరు చక్రాల బండి కట్టి...
ఏడు గుర్రాల కళ్ళెమేసి...
పరబ్రహ్మమును చేరు త్రోవలో...
పయనించవే మనసా!!

సరసాల సార్వభౌమ...

సరసాల సార్వభౌమ విరహాలు విడిరార!!
నాలోని అణువు అణువుకు...
నీ వెచ్చని స్పర్శని పరిచయం చేసి పోర!!

అందాల అవయవాలు ఆనందాన అలసిపోగా...
సోయగాల సోకు తీర్చరార!!

తనువంతా తపనల తహతహ నిండిపోగా...
ఊహల్లో ఏదేదో చేసినావు...
శిఖరాలు చేర్చినావు!!

ఇక ఆగలేనురా సుందర...
జాగుసేయక నన్ను అల్లెయరా ముందర!!

దాచాలేనురా ఇక...
దాగని సొగసుల దాపరికం!!
దరి చేరి అవి దోచేయ్యరా నా దొర!!

Sunday, November 29, 2009

వెన్నెల్లో తీరం...

వెన్నెల్లో తీరం...
గుండెల్లో బారం...
నీకోసమే వేచెనే!!
నిన్నే నే వలచి...
నీ మది గెలిచి...
నీ దరి చేరే క్షణమే ఒక వరం!!

నా ప్రాణం నీవే...
నా గానం నీవే...
నాలో వున్న ఆశకు భావం నీవే...
నీవే నీవే నీవే.. నీవే...
ఎన్నో ఊసులు ఏవేవో బాసలు...
ఇన్నిన్ని కలలకు భావం తెలిపే...
ఏనాడూ లేని ఈ కొత్త భావం...
కలిగింది నాలో నేడే...
కురిసెను మనసున మల్లెల వానలు ఈనాడే...
నాలోని కన్నుల మెరుపులు...
చిలికిన పలుకులు పలికిన గుసగుసలు....
అవి నీవేనమ్మ... నాలోనే కొలువున్న బొమ్మ!!

ఏ రోజులోనా ఈ రోజులాగా లేదేమే ఈనాటి వరకు!!
తెలిసింది కొత్తగా మురిసింది నా ఎద ఆ వేళలోన!!

కలకాలం మరి నాతోడు...
మరి నువుండే...
క్షణమే నాకొక వరమనుకున్న!!
ఆ వరమున నేను తడిసిన వేళ...
పెరిగెను నాలో తపనల తొందరలు!!

నీకోసమే నేను వున్న!!

కాదని అన్న...
కాదనుకున్న...
నీకోసమే నేను వున్న!!

వలదని అన్న...
విసుగనుకున్న...
నా వలపంత నీదే అంటున్న!!

మది నీ రాకను స్వాగతిస్తుంటే...
మరి నిరాకరిస్తావో...
నిజమై నన్నే వరిస్తావో...
తెలిపే క్షణం కోసం...
ఎదురుచూపుల చెరలో బందినై నేవున్న!!

Monday, November 23, 2009

ఇది ప్రళయమో... లేక ప్రణయమో!!

నిన్ను చూసిన తోలి క్షణమే...
మనసు మతి తప్పి నీ నామమే జపిస్తుంటే...
చూపులు గతి తప్పి నీ చిలిపి నవ్వుల అంచులలో నిలిచిపోతే...

అది,
కొత్తగా వయసొచ్చి...
మదిలో ఘనిభవించిన...
కోరికల జలపాతం...
నీ మేని మెరుపుల కాంతుల సోకిన...
ఆ వెండి కాంతుల వెచ్చదనంలో కరిగి...
నీ పిచ్చిలోనే ఉన్న మనసుని తడిపి ముద్దచేస్తుంటే...
ఆ తపనలు తడి తెచ్చిన...
అరుదైన ఆకర్షణ అనుకున్న...
ఆ ఆకర్షణలో కలిగే ఎన్నో ఆలుపెరుగని ఆలోచనలు!!
ఆ ఆలోచనలో రగిలే ఎన్నో అంతులేని ఆవేదనలు!!
అలా రగిలిన వేదనలో చెప్పలేని విరహం...
విరుల హారమేసి వరించింది!!
ఆ విరహంలో నిన్ను పొందే వరకు...
వీడని మగత మాయగా అవరిచింది!!
ఆ మాయలో మనసు మాటవినక...
కంటికి కునుకురాక...
వయసు పోరు పడలేక...
సతమతమౌతున్న!!
ఇది ప్రళయమో... లేక ప్రణయమో...
నువ్వే నిర్ణయించు... నా దిశను నిర్దేశించు!!

Friday, November 20, 2009

మనసైన మంచుకొమ్మ!!

అందాల హంసలేఖ...
రాశాను ఆగలేక!!
మనసైన మంచుకొమ్మ...
మనువాడా వేగిరామ్మ!!

వలచాను నిన్ను నేను...
తొలిచూపు పిలుపులోనే!!

విరహాన వేగలేక...
ఈ వలపంత దాచలేక...
నే మునిగిపోతూ ఉన్న...
ఏ దారి కానరాక...
తలపుల గోదారిలోన!!

తెర చాటు నుండిపోక...
తెర చాపలాగ అల్లి...
సరసాల నావలోన...
శృంగార తీరమేదో నను చేర్చరామ్మ!!

Tuesday, November 17, 2009

మా అన్న!!

శ్రీరాముడంటి మా అన్న వెంట...
ఆ లక్ష్మణుడల్లె జతగా నే వెళ్ళలేకున్నా...
భరతుడినై తను వదిలేళ్లిన...
అడుగు జాడలు...
నా మది ఏలిక చేసుకొని...
తన రాకకై బారంగా బ్రతికేస్తున్న!!

మా అమ్మలోని ఆ అమృతత్వం...
నాన్నలోని ఈ నడిపేతత్వం...
కలగలిపి మా అన్న...
ఆ మనసు వెన్న!!

నే వేసే ప్రతి అడుగు నిర్దేశించే నేప్పరి తానూ!!
అలసిన మనసుకు ఆసరా తానూ!!

దిగులు కలిగిన వేళ నేస్తమల్లే...
చేరదీసి సేదతీర్చే స్నేహితుడు తానూ!!

నా ప్రతి మాటలో తానూ!!
నే నడిచే బాటకు బాసట తానూ!!

నలు దిక్కులలో నే దిక్కు తోచక...
నిలుచున్న నిమిషాన...
గమ్యం చేర్పే నా దిక్కు తానూ!!

నాలో నాకంటే నా అన్నకై పరితపించే...
ఆకాంక్షలు ఎన్నో... ఆశలు ఎన్నో!!
అవి అపురూపాలు... అనిర్వచనీయాలు!!

నిన్ను కోరే నా శ్వాస

నా నిరీక్షణకు అంతం నువ్వు...
ఈ లోకాన నాకున్న ఒకే ఒక్క ఆశవు నువ్వు!!

నువ్వూ నన్ను ప్రేమిస్తున్నావు...
అని నా హృది ప్రతి కదలిక చెపుతుంది...
అది కల కాదని, నిజమే అని...
వేదించే నీ ఆలోచనలను మరిపించే...
నీ చల్లని చూపుల పలుకులతో...
నా మదిని పూదోట చేసే...
ఆ చిన్న మాట చెప్పెస్తావని!!

ఆలోచనలో అలసిన మనసు...
విరహంలో వేసారిన హృదయం...
నీ ప్రేమలో ఆ వేదనలన్నీ మరిచి...
పరవశాన మైమరచిపోవాలి!!

అని అంటోందో నిన్ను కోరే నా శ్వాస!!

Sunday, November 15, 2009

బీటలు లెక్కిన మది మాగాణి!!

బ్రతుకు నిండా బరువు నింపే బాధలేన్నో...
చిన్న ఓదార్పు కోసం మొగమాసిన మనసు..
ఆ మనసు విప్పి చెప్పుకునే ఓ మనిషి తోడు లేక...
నిరాశపు ఎండల వేడిమిలో...
బీటలు బారిన ఈ అనాధ జీవి...
మది మాగాణిలో...
ఓ ప్రేమ దేవత చిలికిన వలపు చినుకులు...
తెనేదారలై... నదిలా మార్చేస్తుంటే...
ఎప్పుడో ఇంకిన ఆ కన్నీటి సంద్రంలో...
ఈ ప్రేమ నది వచ్చి చేరిన క్షణం...
ఆ క్షణం ఎగిసిను లెక్కలేని...
ఆనందపు కెరటాలు ఎన్నో...
మనసుని చిద్రం చేసే అలుపెరుగని...
ఆలోచనలకి సాంత్వన అవి..
అవి మనసుని తడిపి ముద్ద చేస్తుంటే...
మాటలకందని భావం అది...
కన్నీటి వరద అది...
సుఖమైన దుఖం అది...
నిజమై చేరిన కల అది...
అధికమైన ఆవేదనకు అంతం అది...
అంతులేని అపేక్షకి ఆది అది!!

Thursday, November 12, 2009

నా ఎద పిలుపులు

ఈ కోమలి కలువ కన్నుల కాంతులు...
నా కలల నెచ్చెలివేనా!!
ఇది నిజమేనా... వరమై ఎదుట నిలిచెనా!!
ఇలలో ఉన్నానా... లేక కలలోనే ఉన్నానా!!

మనసుకు మాటరాక...
వయసుకు వీలుకాక...
చెప్పలేని భావనేదో...
చెంత చేరి చిత్రమేదో...
చేస్తుంది ఈ వేళన!!
అంతులేని ఆనందానికి...
అడ్డుచెప్పక నిల్చున్న ఈ క్షణాన!!

తొలివరమో... మరి చలి జ్వరమో...
తెలియని తికమకలో నే వున్నా!!
ఇలను మరిచి...కలను విడిచి...
ఈ క్షణమో...మరో క్షణమో...
ఆమె వశమైపోతున్నా... తన వెనకే వెళుతున్నా!!

ఇది తనకు విన్నవించాలన్న అభిలాషకు...
ఆరాటం అధికమౌతున్న...
అది వివరించే భాష తెలియక...
మౌనమే మాట చేసుకున్న!!
చూపులకు పలుకులిచ్చి...
నా ఎద పిలుపులు తనకు తెలుపుతున్న!!

Monday, November 9, 2009

వీరాంజనేయ!!

అంజని పుత్ర... అభయాధినేత...
వీరాంజనేయ... విమలప్రదాత...
విజయానికేత... శ్రీహనుమంతా!!

అకుంటిత దీక్షకు మారు నువ్వు... ఓ మారుతి!!
రామనామ జపమే కదా బహుప్రీతి నీ జిహ్వకి!!
ఆ సీతారాముల కొలువే కదా నీ మనసంతా!!
శ్రీరామ సేవకే అంకితమంటివి జన్మంతా!!

మనసున మైమరిచినావు...
మృదుమధురమైన శ్రీరామ గానామృత ఆలాపనలో!!
తపమున తరించినావు...
తనువున అణువణువున ప్రతిధ్వనించే రామనామ స్మరణలో!!

దుష్ట చేష్టలు దరి చేరవంట... నువ్వు కొలువున్న ఇంటా!!
బయానికి అభయమిచ్చునంట నీ హనుమాన్ చాలీసా!!

Saturday, November 7, 2009

నా చిట్టి తల్లి... చిన్నారి చెల్లి!!

అమ్మకు ప్రతిరూపం...
నాన్నకు సిరిదీపం...
నా మనసున మణిదీపం...
నా ముద్దుల చెల్లి... మా బంగారు తల్లి!!

ఆ మింటి జాబిల్లి...
మా ఇంటికొచ్చింది...
వేవేల వెన్నెల్ల వెలుగుల్లు...
తెచ్చింది మా కంటికి!!

పువ్వల్లె ఎదిగింది మా ఇంటా...
పంటయ్యి ఒదిగింది మెట్టింటా!!

సకల దేవతల సంకలన రూపం...
సమస్త సంతోషాల సమాహారం...
నా చిట్టి తల్లి... చిన్నారి చెల్లి!!

మా కంటి వెలుగులో కొలువున్న తల్లికి...
కొండంతా అండల్లె కడవరకు నేనుంటా!!

Thursday, November 5, 2009

మా అమ్మానాన్నలు!!

సృష్టిలోని ప్రతి జీవికి మొదటి స్ఫూర్తి నాన్న...
ఆ స్ఫూర్తి నడిపే దారిన వెలుగులు నింపే...
ఆరని దీపం అమ్మ!!

అమ్మంటే ఆశావాదం...
నాన్నంటే నడిపే పాదం!!

అమ్మ నేలైతే... నాన్న నింగైతే...
వారి ప్రేమలో పండిన పసిడి పంటలు మేమంటా!!

నిద్దురపుచేందుకు అమ్మ పాడే జోల పాట...
ఆ అమృతంకన్న మిన్న!!
ఎదిగే వయసుకు నాన్న చూపే బాట....
జీవితపు ఆటలో గెలుపును తెచ్చే పూదోట!!

మా మనసు కలత చెందితే కన్నీళ్ళు ఆ కళ్ళలో...
మా ఆనందంలో తమ ఆనందం వెతుకుంటూ...
వారికంటూ ఏమి చూసుకోక...
ప్రతిక్షణం మా కోసం పరితప్పించే ఆ త్యాగజీవులకు...
ఏమిచ్చి తీర్చగలను... ఈ ఋణం!!
ఇది ఆ వరాలిచ్చే దేవుడైన పొందలేని ఒక గొప్ప వరం!!

శతకోటి దేవతల ఏకరూపు మా అమ్మానాన్నలు...
వారిని నిత్యం పూజించే పూజారిని నేను...
విడిచి దూరంగా వెళ్ళలేను!!

అలాంటి అమృతమూర్తులకి...
అవసాన దశలో అమ్మనాన్నని నేనౌతా!!
వయసు తెచ్చే వైరాగ్యపు చీకట్లను తరిమే...
అశాదీపపు వేకువ వెలుగును నేనౌతా!!
సత్తువుడిగి... కదల్చలేని పాదాలకు...
కదలిక తెచ్చి నడిపించే మూడోపాదం నేనౌతా!!

Wednesday, November 4, 2009

నా దేవేరి కావలి!!

ఊర్వశి చిన్నెలు... మేనక వన్నెలు ఏమి వద్దు...
నా చూపుల వేడిమిలో...
ఎరుపెక్కిన బుగ్గలలో మొలక సిగ్గులు చాలు!!

కలువ కన్నులు కానక్కరలేదు...
నను కనుపాపలలో దాచుకునే కాటుక కన్నులు చాలు!!

లోకంలోని అందాలన్నీ తనలో ఉండాలనిలేదు...
తన లోకమే నేను అయితే చాలు!!

నింగిన తారకనో... నేలన మల్లికనో కానవసరం లేదు...
మూర మల్లెలు కొప్పునపెట్టి...
ఆ తారలోచ్చు వేళ నా ముంగిట నిలిచితే చాలు!!

రాయంచ నడకలు... రాచిలుక పలుకులు రావాలని లేదు...
నాతోడై... నీడై... నాలో సగమై...
నామాటకు పదమై...
నా ఆశకు అడుగై...
నాతో నూరేళ్ళు నడిచే...
నా దేవేరి కావలి!!

Monday, November 2, 2009

మనసు నిండ మృత్యుఘోష

యాంత్రికమైన ఈనాటి మనిషి జీవనంలో....
తనలో ఉన్న బుద్దిని, జ్ఞానాన్ని...
నిరాశపు ఆలోచనలు కమ్మేసినప్పుడు...
గాయపడిన మనసుకి మాటలుండవు...
బుద్దికి చేతలుండవు...
ఆ క్షణం మనసు పడే అరణ్య వేదన... వినే చేవులున్నాయా ఈ లోకానికి!!

చెదిరిన మనసు బాధ చెప్పుకునే తోడులేక...
ఒంటరితనం మనసుని వెక్కిరిస్తుంటే...
కాలం ముందుకు సగానని మొండికేసి కూర్చుంటే...
నిరాశపు చీకట్లలో దారిని చూపే దిక్కులేక...
మనసు నిండ మృత్యుఘోష...
మౌనమే తన మాతృభాష...

ఆశలన్ని అంతమయ్యి...
ప్రాణమంటే తీపి లేక...
లోకమంతా శూన్యమయ్యి...
బ్రతుకు అంటే విలువ తెలియక...

అమ్మ నాన్నల ఆశల్ని...
తీర్చలేనేనన్న భీతినోంది...
చావులోన సుఖమునేతుకుతూ...

ఈ లోక బందం బారమయ్యి...
మృత్యువే తనకున్న బందువంటూ...
జోడుకట్టి సాగుతున్నాడు....
తన తనువునే చితిగా చేసి... ఆత్మనే ఆహుతిచ్చి!!