Saturday, April 11, 2009

ఓ నా దేవత

నీకోసం మనసున దాచుకున్న ఎన్నో మాటలు...
ఊహల్లో గీసుకున్న ఎన్నో రూపులు...
కలలో చెప్పుకున్న ఎన్నో ఊసులు...
నీకై పెంచుకున్న ఎన్నో ఆశలు...
యవ్వనంలో అడుగిడిన క్షణం నుంచి
ఓ నా దేవత,
నీ కోసమే నా అన్వేషణ...
నీకోసమే నా నిరీక్షణ...

మది కోవెలలో నిన్ను నిలిపి పూజిస్తున్న...
అపురూపంగా... ఆరాద్యంగా...
-హసమ్న

నీ వయసు కాలం ఎదురుచూపు...

గజిబిజి బతుకుల గమనంలో...
నిమిషం నిలువని జీవన పయనంలో...
నిన్ను నువ్వు మరిచిపోయి ఎందుకోసమో అన్వేషణ,

ఒక్కమారు నీ హృది తెరచిచూడు ఓ సరికొత్త లోకం
నీకై వేచివుంది... నిన్ను స్వాగతిస్తుంది.
మమతలు మమకరాలే కోటలుగా...
అనురాగం అనుబందాలే ఆలంబనగా...
నిర్మితమైన అపురూప సుందర దేశం,
నీ మనసు పుట్టిన ప్రదేశం అది...
తనను విడిచి తెలియని తపనతో ఏదో వెదుకులాటలో...
ఎంతో దూరం పయనించావు, తనను మరిచావు...
నీ రాకకోసం, నీ వయసు కాలం ఎదురుచూపు తనది.
-హసమ్న

Tuesday, April 7, 2009

ఓ నిరంతర బాటసారి...

జీవిత పయనం జీవన గమ్యం
తెలియని ఓ నిరంతర బాటసారి...
ఎక్కడ నీ గమ్యం... అది ఎక్కడని ఈ అలుపెరుగని పయనం...

నిమిషం ఆగి,
నిన్ను నువ్వు అన్వేషించు... నీలోని నిన్ను కలుసుకో...
అప్పటికైనా తెలుస్తుంది నీ గమ్యం నీ హృదయమని... నీ పయనం అటు వైపు అని....