Monday, January 25, 2010

పవిత్ర ప్రేమకి పరిపూర్ణ క్షణాలు!!

తోలి రాతిరి...
తెల్ల చీరలో... మల్లె పూలతో...
తన తోలి అడుగుల సవ్వడి...
రేపే నాలో తుది లేని అలజడి!!

కోటి కోరికలు మనసున కొలువుతీరగా...
తియ్యని తలపులు తెచ్చిన తిమ్మిరులు...
తీరని ఆశ తీరే వరకు తిరిగి పోనంటుంటే...
సిగ్గులు మబ్బుల మాటున
తన లేత చెక్కిళ్ళ ఎరుపుల మెరుపులు...
నా అర చేతుల్లో దాచిన తరుణాలు!!


నా మునివేళ్ళ స్పర్శలో...
మైమరపున మూసిన...
తన చిలిపి కన్నులు తెలిపే...
కన్నె సొగసులు సొంతం చేసుకోమని స్వాగతాలు!!
ఆ స్వాగతాల సరసులో తడిసి...
అర తెరిచిన నా ఇరు కనులు...
తెరిచే సరస సౌధానికి తోలి తలుపులు!!


ఇరువురి శ్వాసలు...
ఇద్దరి మేనులలో...
వెచ్చని తాపాన్ని రగులుస్తూ...
నా నిచ్వాస తన ఉచ్వాసగా మార్చేస్తుంటే...
వణికే పెదవులు నాలుగు...
పరస్పరం పరిచయం కోసం...
పలువరించే క్షణాలు!!

ఆ పరిచయం మీరి...

పెనవేసుకుపోయిన పెదవులు...
ఇరు తనువుల దూరాన్ని దూరం చేస్తూ...
చిరుగాలిని సైతం దూరనివ్వక...
అల్లుకుపోయే ఆత్రాలు!!

మనువున ఏకమైన...
ఇరు మనసులు...
తనువున సైతం...
ఒకరికొకరు లోంగిపోతూ...
ఒకరినొకరు గెలుచుకుంటూ...

ఒకరిలో ఒకరు ఐక్యమైయ్యే
పవిత్ర ప్రేమకి పరిపూర్ణ క్షణాలు!!

Friday, January 8, 2010

సంకురాతిరి సంబరాల సమయమిది...

నేలతల్లి నడుము వొంచి...
వరి సిరుల నొంపగా...
గరిసెలు నిండే గడియలు అవి!!

పాత వస్తువులు...
పనికిరానీ పనిముట్లు...
పోగేసి అగ్ని దేవుడికి అర్పిస్తూ...
వణికించే చలి పులికి...
మంటల సెగలనంటిస్తూ...
కేరింతలు కొట్టే కాలమది!!
చీకటిలా ముసిరిన బాధలకు ముడితీస్తూ...
వేకువ వెలుతురులు తెచ్చే వెలుగు రేకులవి!!

గత కాలపు గాయాలను మాన్పి...
గుండెల నిండా సరికొత్త ఆశలను...
నింపుకునే తరుణమది!!

ఇంటింట సందడి...
ఊరంతా సంతోషాల సవ్వడి!!
చుట్టాలందరూ ఒకే ఇంట చేరి...
ఆప్యాయతను పంచుకుంటూ...
ఆదమరిచి ఆనందన మునిగితేలే ఆస్వాదన అది!!

అదే సంబరాలకు సమయమైన సంకురాతిరి!!

Sunday, January 3, 2010

చిలిపై.... చెలిమై...

చిలిపై....
చెలిమై...
చెంతకు చేరింది!!
మగువై...
మనువై...
మనసుని ముడివేసింది!!

Saturday, January 2, 2010

ప్రతిక్షణం నీ కోసం...

ప్రతిక్షణం నీ కోసం...
పరితపించే నా మనసునడుగు!!

అనుక్షణం నీకోసం...
అన్వేషించే నా ఆలోచనగుడు!!

నువ్వు ఎదురైతే...
నవ్వులు పూచే నా పెదవులనడుగు!!

నువ్వు పలకరిస్తే...
తడబడే నా మాటలనడుగు!!

తెలుపుతాయి అవి నీకు...
నీకై తలచిన తలపులు ఎన్నో!!
నీకై వగచిన వేళలు ఎన్నో!!
నీకై దాచిన వలపులు ఎన్నో!!