సరస్వతి ప్రియ పుత్రా... శ్రీ బాల సుబ్రహ్మణ్యా...
స్వరకర్తలే మిము దీవించగా... ఏడేడు లోకాలు మైమరువగా...
నీ గానమే గంధర్వము... ఆ గానమే నీ గమనము... ఆ గానమే నీ గమ్యము...
సాగిందిగా అలా వెయ్యేళ్ళు నిలిచేలా నీదు స్వరప్రస్థానము!!
ఏమని పొగడెదను మా బాల స్వరహేల...
నిను ఏమని పొగడెదను
రాగ భావములే అనురాగాలుగా...
శృతిలయలతో సంగమించుతూ...
సుధామదువులే మాకు పంచగా...
గాన కోవిదా నువు గళము విప్పగా...
పరవసించదా చిన్ని మా ఎద!!
నాద శరీరుడే నర్తించి ఆడ...
నీ కంఠమే కైలాసమును చేసిన నిను !!ఏమని!!
ఆత్రేయ వారి మనసాలింగనములు...
వేటూరి వారి విశ్వరూపములు...
మా సీతారాముడి సిరి వెన్నెలలు...
తమరి గళమున తరుణమిల్లగా...
స్వరాలర్చనే నీకు సంబరం...
అందుకు వేదిక కాగ ఆ అంబరం..
చిరయశమైనది నీ మధుర గానం...
చిరు భూషణముగా పద్మ భూషణమందించి...
మురుసిపోయే మా భారతావని!!
Monday, June 20, 2011
Subscribe to:
Posts (Atom)