Sunday, July 24, 2011

Infatuation

Hello Hello Young Boy
Listen to Me Little Boy

టీనేజి ఎజ్ లో...
కాలేజి డేస్స్ లో...
కవ్వించే ప్రతి అందం...
అకర్షణేలే... అపురూపమేలే...

కళ్ళు కళ్ళు కలిసి...
ఒళ్ళు ఒళ్ళు తాకే వేళ...
ఎదలో ఎదో గుబులే చాలా...
ఇలా ఇలా అంటూ Equation...
చేసే వీలుకాదే...
కుర్ర వయసుల కుదిపేసే Problem...
చెప్పే వీలులేని చూపే చిత్రమేలే...
పసి మనసుల్లో...
పరవశం పోంగే Passion...
అది ఇది అని కాదే...
అన్ని తానే అంటూందే Infatuation!!

Friday, July 15, 2011

నిన్ను చూశాక...

నిన్ను చూశాక...
కడలిలో అలలాగా ఎగిసే నా మనసే!!
వణికే పెదవుల్లో...
పలికే మౌనలే మధుగీతాలు!!
చూపుల వాయిద్యంపై...
మనసే మీటే ప్రియరాగాలు!!
కలల కుంచెలపై కదిలే చిత్రం నీదే!!
ఊహాల వేదికపై జరిగే వేడుకలో నాతోడువు నీవే!!

Monday, June 20, 2011

శ్రీ బాల సుబ్రహ్మణ్యా...

సరస్వతి ప్రియ పుత్రా... శ్రీ బాల సుబ్రహ్మణ్యా...
స్వరకర్తలే మిము దీవించగా... ఏడేడు లోకాలు మైమరువగా...
నీ గానమే గంధర్వము... ఆ గానమే నీ గమనము... ఆ గానమే నీ గమ్యము...
సాగిందిగా అలా వెయ్యేళ్ళు నిలిచేలా నీదు స్వరప్రస్థానము!!

ఏమని పొగడెదను మా బాల స్వరహేల...
నిను ఏమని పొగడెదను
రాగ భావములే అనురాగాలుగా...
శృతిలయలతో సంగమించుతూ...
సుధామదువులే మాకు పంచగా...
గాన కోవిదా నువు గళము విప్పగా...
పరవసించదా చిన్ని మా ఎద!!
నాద శరీరుడే నర్తించి ఆడ...
నీ కంఠమే కైలాసమును చేసిన నిను !!ఏమని!!

ఆత్రేయ వారి మనసాలింగనములు...
వేటూరి వారి విశ్వరూపములు...
మా సీతారాముడి సిరి వెన్నెలలు...
తమరి గళమున తరుణమిల్లగా...
స్వరాలర్చనే నీకు సంబరం...
అందుకు వేదిక కాగ ఆ అంబరం..
చిరయశమైనది నీ మధుర గానం...
చిరు భూషణముగా పద్మ భూషణమందించి...
మురుసిపోయే మా భారతావని!!

Thursday, November 4, 2010

నీ పయనం సాగడమే ఓ గగనం


నిశ్శబ్ద వీణల నిక్వాణంలో...
నిర్వేదమే నీకు వేదం...
నీ ఎద ఘోషల నిస్వానంలో...
నిశీథమే నీకు శోభితం..
వయసుడిగిన ఈ ఈడులో...
నీ నీడ కూడా నీ తోడూ విడిచే...
నీ ఆశల శోదనలో... నీ సాదన ఫలితం...
ఈ ఎడారి జీవితం...
ఇప్పుడు వేదన చెందితే ఏం లాభం...
సహారాలో తుషారాలకై వెదకడం నీ నేరం!!

గజిబిజి బతుకుల గమనంలో...
నిమిషం నిలువని పయనంలో...
క్షణమైనా ఎద వ్యధని వినవు...
ఓ మనిషి నువ్వో మరమనిషై పోతున్నావు...
మనసుని మసి చేస్తున్నావు...
నిన్నే మోసం చేస్తున్నావు...
గమ్యం తెలియని పరుగుల పయనంలో...
పాదాలకు రెక్కలు కట్టి...
గగనంలో ఎగరేశావు...
చుక్కల్లో చూపులు నిలిపి...
ఆ రెక్కలు అలిసిన వేళ...
నీ వయసుకి ముక్కాలే మొలిచిన వేళ...
నీ ప్రక్కల వుండదు నిను సేద తీర్చే ఏ తీరం...
నీ తోడు నిలిచే ఏ బంధం...
ఆ సమయం నీ పయనం సాగడమే ఓ గగనం!!

Monday, October 18, 2010

ప్రాయం యవ్వన తీరాన....

పల్లవి:
ప్రాయం ప్రణయం ఎకమైయ్యే లోకాలు...
ప్రేమేపంచే ప్రేయసే ప్రాణమయ్యే ప్రాయాలు...
ఎదురుగ వచ్చే యవ్వనాల తీరాన....
తోలి అడుగులు వేసిన నిమిషాన...
విరిసే మనసే ఎగిరే ఆకాశాన...
అలుపేలేని ఆలోచనలో ఊరేగే ఆశలుచాన...
సొగసే మొగ్గై విచ్చి...
సిగ్గై బుగ్గన దాగిన పరువాన...
వనమై పూచే...
వరదై పొంగే... ఈడే
తొలిగా తెలిపింది...
తన జోడే కోరింది...
ఎదలో ఏమైయ్యిందో...
ఏం దాగుందో...
తెలియని మక తికలో
వయసే మాయ చేస్తుంది...
కథనే మార్చివేస్తుంది !!ఎదలో!!

చరణం-1:
పడచుల పరిచయాల కొలువులో...
పరిదులెన్నో పెంచేస్తుంటే...
చదివే పుస్తకంలో...
అక్షరాలన్నీ అమ్మాయిగా అనిపిస్తుంటే..
మధురంగా మస్తాకాన్నే తోలిచేస్తుంటే!!
చల చల్లని పిల్లగాలి... చిలిపిగ మారి...
మెల మెల్లగ మనసే చేరి...
పరికిణి మేని పరిమళంలో...
తనువుని తడిపేస్తుంటే...
తపనలు ఆగని తమకంలో...
చిలిపి మనసు చలించెను చిత్రంగా !!ఎదలో!!

చరణం-2:
వలపుల సంద్రపు తలపుల తొలి అలలు...
అణువణువును తాకి ఆత్రం పెంచేస్తుంటే...
మనసే మౌనంగా మైకంలో మునుగుతువుంటే...
శతవేల తారకల నడుమ తన...
జతనేలు జాబిలమ్మకై జరుగుతున్న అన్వేషణలో...
కుర్ర వయసుకి కొత్తగా కలిగెను కొంటెతనాలు !! ప్రాయం!!

Thursday, September 23, 2010

ఫుల్ పటయిస్తాం...

కాలేజి కలరింగ్...కవ్వించే కులుకుల స్వింగ్...
మా కుర్ర కళ్ళకి అవి డైలి విందే....
ఒంపుసొంపుల్లో వుందో మాగ్నెట్...
చూసే మనసుల్ని చేసే ఇగ్నైట్...
ఓరచూపు తగిలిందంటే ఇక మా హార్టు బీట్ హైజాకే...

సొగసరి స్మైల్స్ లొని గ్లిట్టర్...
మా ఉడుకు వయసుని ఊరించే ట్విట్టర్...
క్యాట్ వాకుల నడుముల్లో చిలిపి చూపుతో ట్వీటే చేస్తాం...
కొరికేసే కళ్ళతో ఒళ్ళంత స్కానే చేస్తాం...
హాట్ హాట్ హార్ట్ కి అర్జెంటుగా అప్లోడ్ చేస్తాం...
వెచ్చని ఊపిరిలో మెచ్చిన ఊహాలు డ్వౌన్లోడ్ చేస్తాం...
ఉసిగొలిపే కసి కలలను ఎద నిండ ఇంపొర్ట్ చేస్తాం...
ఎసెమ్మెస్ ల మెస్ ల్లో ఊసులు బొంచేస్తాం...

పికాసాలో ఫోజే ఇచ్చి... గుగూల్ సెర్చ్ కే గుబులే పుట్టే...
సెర్చ్ టెక్ట్స్ లే మేమే రాస్తాం....
అందమైన నేస్తాల సెర్చ్ లో ఆర్కుట్ ని ఆరాధిస్తాం...
స్క్రాపులతో తెగపోగిడేస్తాం...
వాయిస్ చాటులో...
మెస్సెంజర్ కే మూడే వచ్చే మాటలెన్నో చెపుతుంటాం...
ఫైనల్ గా ఫుల్ పటయిస్తాం...

కాలేజి లవ్...

క క కాలేజ్... కుర్ర వయసుల బ్యారేజ్...
టి టి టీనేజ్... చిలిపి మనసుల చాలెంజ్...
ఎదిగే వయసులు మావి….
ఒదిగి ఉండలేము… కుదురుగుండలేము….
కాలేజీ క్యాంపస్ ఊఊ … మా మనసుల కంపాస్ ఊఊ…
కలరింగే మా కళ్ళకి హై వోల్ట్స్
గ్రూపులు కడతాం… గొడవలు పడతాం….
అమ్మాయిల గుండెల్లో హీరో ఛాన్స్ కై క్యూ కడతాం…
కాలేజీ క్యాంపస్ ఊఊ… కన్నె కులుకుల కోరస్ ఊఊ...

నచ్చిన పిల్లకి రోజాలిస్తాం…
రోజుకో ప్రేమలేఖనే రాస్తాం…
లవ్లీ కళ్ళకి లైనే వేస్తాం…
ఊహల్లో ఊరేగిస్తాం…. ఊసులతో బ్రతికేస్తాం…
కాలేజీ క్యాంపస్ ఊఊ… మా కోటి కలల ప్యాలెసు ఊఊ...
ఉరికే మనసులు మావి…
తిరిగి చూసుకోము… తపన మానుకోము….

అమ్మాయిల హార్టు... ప్రేమకు సుప్రీంకోర్టు...
అది మా మనసుల్ని చేసిన హర్టు...
లవ్ లైఫులో ఓ పార్టు....
అని తెలిసి లైట్ తీసుకోవడం ఒక ఆర్టు....
కాలేజి లవ్... కాదుగా అదే లైఫ్...
డినైడ్ ప్రేమలు మాకొద్దు...
దిక్కులు ఏలు సత్తువ మా సొత్తు....
లైఫ్ ని లైట్ తీసుకోము...
లవ్ హిస్టరీ డెప్తులు చదివేస్తాం...

కాలేజి క్యాంపస్ ఊ ఊ... మా ఫ్యూచర్ లైఫ్ కి బేస్...
యంబిషన్ని అలుసే చెయ్యం... ఆస్పిరేషన్ని అస్సలు విడువం....