Thursday, November 4, 2010

నీ పయనం సాగడమే ఓ గగనం


నిశ్శబ్ద వీణల నిక్వాణంలో...
నిర్వేదమే నీకు వేదం...
నీ ఎద ఘోషల నిస్వానంలో...
నిశీథమే నీకు శోభితం..
వయసుడిగిన ఈ ఈడులో...
నీ నీడ కూడా నీ తోడూ విడిచే...
నీ ఆశల శోదనలో... నీ సాదన ఫలితం...
ఈ ఎడారి జీవితం...
ఇప్పుడు వేదన చెందితే ఏం లాభం...
సహారాలో తుషారాలకై వెదకడం నీ నేరం!!

గజిబిజి బతుకుల గమనంలో...
నిమిషం నిలువని పయనంలో...
క్షణమైనా ఎద వ్యధని వినవు...
ఓ మనిషి నువ్వో మరమనిషై పోతున్నావు...
మనసుని మసి చేస్తున్నావు...
నిన్నే మోసం చేస్తున్నావు...
గమ్యం తెలియని పరుగుల పయనంలో...
పాదాలకు రెక్కలు కట్టి...
గగనంలో ఎగరేశావు...
చుక్కల్లో చూపులు నిలిపి...
ఆ రెక్కలు అలిసిన వేళ...
నీ వయసుకి ముక్కాలే మొలిచిన వేళ...
నీ ప్రక్కల వుండదు నిను సేద తీర్చే ఏ తీరం...
నీ తోడు నిలిచే ఏ బంధం...
ఆ సమయం నీ పయనం సాగడమే ఓ గగనం!!

2 comments:

Anonymous said...

chaala baaga chepparu... i like it.

Unknown said...

సూపర్ సూపర్