Sunday, February 3, 2008

మగువ

సగటు మనిషిలా చూస్తే కనిపిస్తాయి
మగువ సొంపులు సోయగాలు, మనసుతో
చూస్తే కనిపిస్తాయి వర్ణింప శక్యం కాని ఆతరుణి అందాలు..!
పడతి ప్రకృతి అందాలలో ఒక భాగంచూసి తరిస్తూ అరాదిస్తూ
అనందించాలే తప్పఅన్ని అందాలు తన సొంతం కావాలనుకోవడం,
అసమంజసం అవివేకం.

కాలం కరగనంటున్న...

కాలం కరగనంటున్న కలలు వీడనంటున్న,
నిన్ను చేరాలనే ఆరాటం అధికమౌతుంది,
ఇది వలపు వైఖరినా..? లేక పరువపు పలకరింపా..?
ఈనాటి వరకు లేని ఊహాలు ఎద నిండుతుంటే
మనసు అందని తీరాలు చేరాలని ఆశ పడుతుంది,
ఇది వయసు ఆరాటమా..? మనసు ఆర్భాటమా..?

నిన్ను చూసిన క్షణం...

నిన్ను చూసిన క్షణం స్పందనెరుగని గుండెలో,
ఎన్నో అలజడుల అలలు, అవి నింగినంటే కెరటాలై
నన్ను ప్రణయసాగరంలో ముంచివేయక మునుపే
నన్ను నీ దరికి చేర్చుకోవా...!
నిన్ను చేరాలనే ఆశ అనంత వాయువుల్లో కలసి,
సుడిగాలై వచ్చి నన్ను చుట్టివేయక మునుపే
నా ఊపిరివై నాలో నిండిపోవా ...!

Saturday, February 2, 2008

ఒకనాటి నేను...

ఒకనాటి నేను ప్రశాంత గాంభీర్య సాగరాన్ని,
ప్రేయసి అంబరమై వలపు చినుకులు నాపై కురిపించెను,
ఆ అపురూప బావనలు జడి వానై మది చేరగానే,ఎద సడి చేసెను,
ఆ అరుదైన వేళ అనందహేళ ఉప్పెనై నను ముంచెను,
అలికిడులు లేని నా ఎద సంద్రంలొ అలజడులు రేగి, తనను
చేరుకోవాలని అంతులేని అరాటంతో ఎగిసిపడే ఆశల కెరటాలు ఎన్నో...
అంబరమైన తనను అందుకోలేనని తెలిసిన,
ఎంతవరకు ఈ ప్రయత్నం, ఈ పట్టుదల ప్రాణం ఉన్నంత వరకా...!

ప్రేమకి తొలి ఘడియలు...

ఇన్నాళ్ళు స్తబ్దమైన నామనసు, నీ
కాలి మువ్వల సవ్వడి నా చెవికి చేరగానే,
తనువులోని మనస్సు, ఆ మనసులోని బావాలు,
పలికెను కోటి వేణువుల నాథమై,
మరిపించెను తనువునే, మైమరపించెను మనసునే,
అచేతనమైన నాహౄదిలో చైతన్య-వెలుగులు నిపింది నీ సుంధర మకరంధ ధరహాసం,
ఇవేనేమో ప్రేమకి తొలి ఘడియలు...!

మదిలో పలుకలేని బావాలు పలికించలేని రాగాలు ఎన్నో,
మౌనమైన భాషలు మరపురాని అనుభూతులు,
అలుపెరగని ఆశలు, కవ్వించే కోరికలు కలల కోటలు ఇంకెన్నో,
కాకి పలుకులు సైతం కోయిల పాటలు,

ఇవేనేమో ప్రేమకి ఆనవాళ్ళు...!

తొలి చూపులో...

కనులు నిన్ను చూశాక,
ఎద నిన్ను కొరి, మనసు నా మాట వినక,
వలపు పూబాటలో నీకై పరుగిడుతుంటే,
అపలేక అలసిపోయి నేవున్న ప్రియతమా...!

Thursday, January 31, 2008

ప్రేమామృతము

నీ ప్రేమ తలపులు తీపి గుర్తులై వెన్నెల నింపుతుంటే,
ఆ ప్రేమావేశపు అంచున ఉన్న నాకు చావు లోయల్లో పడిపోతున్నని తెలిసిన వేళ,
అవేదన అనంతమై అలొచనలు అడుగంటుతుంటే,
గుండె చప్పుడులు సైతం మరణ సంకేతాలై వెంటాడుతుంటే,
నీ ప్రేమామృతముతో నన్ను బ్రతికించగలవా..? ప్రియతమా..

Monday, January 21, 2008

తొలి ముద్దు

సుప్రభతాపు సూర్యుని మేనిలో,
నీ రూపు చూసి కవినై కవితలు వల్లిస్తూ ,
మైమరచి నిన్నే చూస్తూ,నన్ను నేను మరచిపోయాను ప్రియా.....!
ఇన్నాళ్ళ నా నిరీక్షణ ఫలించిందా..? యన్న సంతోష సందిద్గంలో నే వుంటే,
ఒక చిన్న చిరునగవుతో నీ లేత అధరాలు నా నుదిటిపై వుంచి ఓ చిరుముద్దు,
ఆ క్షణం కలిగిన అద్వితీయ అనుభూతి అజరామరం అనిర్వచనీయం.

నా చిన్నారి

తొలిసారి నా చిన్నారి ఎడుపు రాగాలు నా చెవినపడగానే

ఆనంద రాగాలు పరవల్లతొ వచ్చి నా మదిని మహాదానంద పరవశాన ముంచెను,

నేను కవినైన ఏ కవితలో చెప్పలేనిది ఆ భావన,

అది తెలుసుకొవలంటే, దాన్ని అస్వాదించి ఆనందించే నా మనసులోకి పరమది ప్రవేశం చేయడం ఓకే ఒక్క మార్గం.