Sunday, September 20, 2009

జీవుడి గమనం!!

జననం భువనం... మరణం గగనం ఐతే...
ఆ రెంటి నడుమ...
ఎంతో పయనముంది... మరెంతో ప్రయాసవుంది!!
ఎంతో జీవనముంది...ఇంకెంతో జీవితముంది!!
ప్రేమలున్నాయి... పోరులున్నాయి!!
కష్టాలున్నాయి... సుఖాలున్నాయి!!
కలతలున్నాయి... కన్నీళ్ళున్నాయి!!
బ్రతుకులున్నాయి... భవితలున్నాయి!!
విటన్నిటిని పెనవేసి...
ఆ చావు-పుట్టుకలను కలిపే సన్నని జీర...
ఈ జీవుడి గమనం!!

ఆరు చక్రాల బండిలో బ్రహ్మమును చేరే దిశలో...
అరిషడ్వర్గాలతో పోరు సలిపి...
వాటికి లొంగిన బీరులు,
బ్రతికున్న విగత జీవులు... గమ్యం మరిచిన గ్రుడ్డి ప్రాణులు!!
వాటినే లొంగదీసిన వీరులు, ధీరులు...
మరణంలోనూ అమరం పొందే దైవులు!!
బ్రహ్మముతో ఐక్యమయ్యే బ్రతుకు జీవులు!!
పరమాత్మలో లీనమైయ్యే అత్మరాములు!!

No comments: