Friday, September 25, 2009

ఘనీభవించిన స్నేహపు మేఘాన్ని నేను...

మేఘాలు ఉరుముతున్నాయి... కాని వాన లేదు!!
గుండె కొట్టుకుంటుంది... కాని చప్పుడు లేదు!!
పెదవులు కదులుతున్నాయి... కాని పలుకు లేదు!!
ఒంట్లో ఉసురుంది.. కాని ఉలుకు లేదు!!
గడిచిన రోజులో ఎ ఒక్కక్షణం కూడా...
నన్ను జ్ఞప్తికి తేలేదా... మిత్రమా!!

ఘనీభవించిన స్నేహపు మేఘాన్ని నేను...
నీ నులివెచ్చని చెలిమిలో కరిగించు...
వానై కురుస్తాను... ఆనందపువరదనౌతాను!!
శూన్యంలో చూడకు నేస్తమా... ఆ కొట్టుకునే గుండె చప్పుడు వినిపించదు...
ఆ హృది అట్టడుగు పొరల్లో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాల గనిని త్రవ్వి చూడు...
అది చేసే చప్పుడు ఎంత మదురమో!!
కదిలే పెదాల నరాలను తాకిచూడు...
స్వాంతన స్వరాలను మీటుతాయి... స్నేహపుగీతాన్ని ఆలపిస్తాయి!!
ఉలుకు లేదని నువ్వు ఉస్సురుమంటున్న... నీ ఉశ్చ్వాస నిశ్వాసల కదలికలలో నేనున్నా!!
నిన్ను క్షణమైనా మరిస్తే కదా మిత్రమా... మరల గుర్తు చేసుకునేది!!
గతించిన క్షణాల్లోనే కాదు... గమిస్తున్న క్షణాల్లోనూ...
ప్రతిక్షణం నా తలపులలో... అనుక్షణం నా ఆలోచనలలో...
నేను ఒంటరిని కాదంటూ తోడై ఉనావు!!
నే వేసే ప్రతి అడుగుకు విరుల త్రోవైనావు!!

3 comments:

కెక్యూబ్ వర్మ said...

చాలా బాగుంది నరేన్ గారు. స్నేహమాధుర్యాన్ని బాగా ఆవిష్కరించారు. ప్రతిక్షణం ఉచ్వాశ నిశ్వాశలలో కదలాడే మిత్రుడిని మరిచిపోగాలమా. బాగా చెప్పారు. ధన్యవాదాలు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నా మీనుండి.

Naren said...

ధన్యవాదాలు కుమార్ గారు... మీ అమూల్యమైన విశ్లేషణకు, నేను సాఫ్టువేరు జాబు చేస్తున్నాను, కొంచెం ఉద్యోగ పని బిజీగా ఉండి కవిత్వం మీద టైం స్పెండ్ చేయలేక పోయనండి!!

Unknown said...

reallyyyy nice... there is no words 2 express...........