Thursday, November 4, 2010

నీ పయనం సాగడమే ఓ గగనం


నిశ్శబ్ద వీణల నిక్వాణంలో...
నిర్వేదమే నీకు వేదం...
నీ ఎద ఘోషల నిస్వానంలో...
నిశీథమే నీకు శోభితం..
వయసుడిగిన ఈ ఈడులో...
నీ నీడ కూడా నీ తోడూ విడిచే...
నీ ఆశల శోదనలో... నీ సాదన ఫలితం...
ఈ ఎడారి జీవితం...
ఇప్పుడు వేదన చెందితే ఏం లాభం...
సహారాలో తుషారాలకై వెదకడం నీ నేరం!!

గజిబిజి బతుకుల గమనంలో...
నిమిషం నిలువని పయనంలో...
క్షణమైనా ఎద వ్యధని వినవు...
ఓ మనిషి నువ్వో మరమనిషై పోతున్నావు...
మనసుని మసి చేస్తున్నావు...
నిన్నే మోసం చేస్తున్నావు...
గమ్యం తెలియని పరుగుల పయనంలో...
పాదాలకు రెక్కలు కట్టి...
గగనంలో ఎగరేశావు...
చుక్కల్లో చూపులు నిలిపి...
ఆ రెక్కలు అలిసిన వేళ...
నీ వయసుకి ముక్కాలే మొలిచిన వేళ...
నీ ప్రక్కల వుండదు నిను సేద తీర్చే ఏ తీరం...
నీ తోడు నిలిచే ఏ బంధం...
ఆ సమయం నీ పయనం సాగడమే ఓ గగనం!!

Monday, October 18, 2010

ప్రాయం యవ్వన తీరాన....

పల్లవి:
ప్రాయం ప్రణయం ఎకమైయ్యే లోకాలు...
ప్రేమేపంచే ప్రేయసే ప్రాణమయ్యే ప్రాయాలు...
ఎదురుగ వచ్చే యవ్వనాల తీరాన....
తోలి అడుగులు వేసిన నిమిషాన...
విరిసే మనసే ఎగిరే ఆకాశాన...
అలుపేలేని ఆలోచనలో ఊరేగే ఆశలుచాన...
సొగసే మొగ్గై విచ్చి...
సిగ్గై బుగ్గన దాగిన పరువాన...
వనమై పూచే...
వరదై పొంగే... ఈడే
తొలిగా తెలిపింది...
తన జోడే కోరింది...
ఎదలో ఏమైయ్యిందో...
ఏం దాగుందో...
తెలియని మక తికలో
వయసే మాయ చేస్తుంది...
కథనే మార్చివేస్తుంది !!ఎదలో!!

చరణం-1:
పడచుల పరిచయాల కొలువులో...
పరిదులెన్నో పెంచేస్తుంటే...
చదివే పుస్తకంలో...
అక్షరాలన్నీ అమ్మాయిగా అనిపిస్తుంటే..
మధురంగా మస్తాకాన్నే తోలిచేస్తుంటే!!
చల చల్లని పిల్లగాలి... చిలిపిగ మారి...
మెల మెల్లగ మనసే చేరి...
పరికిణి మేని పరిమళంలో...
తనువుని తడిపేస్తుంటే...
తపనలు ఆగని తమకంలో...
చిలిపి మనసు చలించెను చిత్రంగా !!ఎదలో!!

చరణం-2:
వలపుల సంద్రపు తలపుల తొలి అలలు...
అణువణువును తాకి ఆత్రం పెంచేస్తుంటే...
మనసే మౌనంగా మైకంలో మునుగుతువుంటే...
శతవేల తారకల నడుమ తన...
జతనేలు జాబిలమ్మకై జరుగుతున్న అన్వేషణలో...
కుర్ర వయసుకి కొత్తగా కలిగెను కొంటెతనాలు !! ప్రాయం!!

Thursday, September 23, 2010

ఫుల్ పటయిస్తాం...

కాలేజి కలరింగ్...కవ్వించే కులుకుల స్వింగ్...
మా కుర్ర కళ్ళకి అవి డైలి విందే....
ఒంపుసొంపుల్లో వుందో మాగ్నెట్...
చూసే మనసుల్ని చేసే ఇగ్నైట్...
ఓరచూపు తగిలిందంటే ఇక మా హార్టు బీట్ హైజాకే...

సొగసరి స్మైల్స్ లొని గ్లిట్టర్...
మా ఉడుకు వయసుని ఊరించే ట్విట్టర్...
క్యాట్ వాకుల నడుముల్లో చిలిపి చూపుతో ట్వీటే చేస్తాం...
కొరికేసే కళ్ళతో ఒళ్ళంత స్కానే చేస్తాం...
హాట్ హాట్ హార్ట్ కి అర్జెంటుగా అప్లోడ్ చేస్తాం...
వెచ్చని ఊపిరిలో మెచ్చిన ఊహాలు డ్వౌన్లోడ్ చేస్తాం...
ఉసిగొలిపే కసి కలలను ఎద నిండ ఇంపొర్ట్ చేస్తాం...
ఎసెమ్మెస్ ల మెస్ ల్లో ఊసులు బొంచేస్తాం...

పికాసాలో ఫోజే ఇచ్చి... గుగూల్ సెర్చ్ కే గుబులే పుట్టే...
సెర్చ్ టెక్ట్స్ లే మేమే రాస్తాం....
అందమైన నేస్తాల సెర్చ్ లో ఆర్కుట్ ని ఆరాధిస్తాం...
స్క్రాపులతో తెగపోగిడేస్తాం...
వాయిస్ చాటులో...
మెస్సెంజర్ కే మూడే వచ్చే మాటలెన్నో చెపుతుంటాం...
ఫైనల్ గా ఫుల్ పటయిస్తాం...

కాలేజి లవ్...

క క కాలేజ్... కుర్ర వయసుల బ్యారేజ్...
టి టి టీనేజ్... చిలిపి మనసుల చాలెంజ్...
ఎదిగే వయసులు మావి….
ఒదిగి ఉండలేము… కుదురుగుండలేము….
కాలేజీ క్యాంపస్ ఊఊ … మా మనసుల కంపాస్ ఊఊ…
కలరింగే మా కళ్ళకి హై వోల్ట్స్
గ్రూపులు కడతాం… గొడవలు పడతాం….
అమ్మాయిల గుండెల్లో హీరో ఛాన్స్ కై క్యూ కడతాం…
కాలేజీ క్యాంపస్ ఊఊ… కన్నె కులుకుల కోరస్ ఊఊ...

నచ్చిన పిల్లకి రోజాలిస్తాం…
రోజుకో ప్రేమలేఖనే రాస్తాం…
లవ్లీ కళ్ళకి లైనే వేస్తాం…
ఊహల్లో ఊరేగిస్తాం…. ఊసులతో బ్రతికేస్తాం…
కాలేజీ క్యాంపస్ ఊఊ… మా కోటి కలల ప్యాలెసు ఊఊ...
ఉరికే మనసులు మావి…
తిరిగి చూసుకోము… తపన మానుకోము….

అమ్మాయిల హార్టు... ప్రేమకు సుప్రీంకోర్టు...
అది మా మనసుల్ని చేసిన హర్టు...
లవ్ లైఫులో ఓ పార్టు....
అని తెలిసి లైట్ తీసుకోవడం ఒక ఆర్టు....
కాలేజి లవ్... కాదుగా అదే లైఫ్...
డినైడ్ ప్రేమలు మాకొద్దు...
దిక్కులు ఏలు సత్తువ మా సొత్తు....
లైఫ్ ని లైట్ తీసుకోము...
లవ్ హిస్టరీ డెప్తులు చదివేస్తాం...

కాలేజి క్యాంపస్ ఊ ఊ... మా ఫ్యూచర్ లైఫ్ కి బేస్...
యంబిషన్ని అలుసే చెయ్యం... ఆస్పిరేషన్ని అస్సలు విడువం....

Saturday, August 28, 2010

లైట్ తీసుకుందాం ప్రేమ...

వినరా మామ ప్రేమకు లేదు ఏ ఊరు పేరు...
ఐన తనకై మనలో ఎందుకు ఈ పోరు...
ఒకరికి చెందని ప్రేమ మరి ఒకరికి అందును మామ...
అది మన తప్పేమీ కాదురా మామ...
లైట్ తీసుకుందాం ప్రేమ...
మన ప్రేమను పొందే అదృష్టం...
తనకే లేదనుకుందాం...
ఈ గాయమే రేపటి తీపి జ్ఞాపకంగా మలుచుకుందాం...
అంతేగాని అమ్మాయి కాదంటే...
కడ తేరడమో... కడ తేర్చడమో...
కాకూడదు మామ....
ప్రేమకథకు క్లైమాక్ష్

లైట్ తీసుకుందాం మామ...
లైఫ్ ఏలుకుందాం మామ...
కాలేజి డేసురా మామ...
వినరా మామ ప్రేమలో లేదు క్లాసు మాసు..
ఐన ఎందుకు మనలో మాత్రం ఆ తేడా బాసు...

కాలేజి కలర్సు... కుర్ర కళ్ళకి అవి అదుర్సు...
పిల్లను చూపిస్తుంది... వయసుకి వల వేస్తుంది...
అక్షాంశాలు రేఖాంశాలు ఆ అమ్మాయిలో చూపెడుతుంది...
భూమధ్యరేఖను భాణం చేసి మదికే వేసేస్తుంది...
మల్లెలు కురిపిస్తుంది... మనసుని కవ్విస్తుంది...
గాల్లోతేలినట్టు గగనం ఏలినట్టు...
ఊహాలు పుట్టిస్తుంది... ఊసులు నేర్పిస్తుంది...

Saturday, July 10, 2010

తొలిసారి నాలో తెలిసింది ఏదో...

తొలిసారి నాలో తెలిసింది ఏదో...
మలిసారి మౌనం దాచింది ఎదలో...
తెగువే రాక...
తలపంత మారే నీ రూపమై...
తనువంతా తడిపే ఓ తడిలేని తాపం...
పులకించి పువ్వై పూచింది ప్రాయం...
నయనాలు నవ్వే నా నునుసిగ్గు చూసి...
గతకాలమంతా నే మరచిపోయా...
నీ మగతలోన నే వుండిపొయా...
ఈ భావాలు నాలో బ్రతికించుకోగా...
క్షణకాలమైన కథ మార్చిపోవా!!

Thursday, July 8, 2010

మదిలో చోటిచ్చాక...

ఆధారం అందిస్తా...
మధురం పంచిస్తా...
మదిలో చోటిచ్చాక...
మనసే నికిచ్చాక...
దొరికిన ఏకాంతం...
దోచే ఆసాంతం...
తెగువే చూపించి...
తెరలే తొలగించి...
దరికే చేరి...
దాచిన సొగసుల దానం చేసేయ్యవా!!

Monday, June 7, 2010

నా దేవేరి పుట్టిన రోజు!!

అక్షయ తృతీయ అలిగిన రోజు...
అతివల అవనికి అసూయ కలిగిన రోజు...
అందానికి అర్థం తెలిసిన రోజు...
జాబిల్లికి తోబుట్టువు జన్మించిన రోజు...
నా అర్థభాగం రూపు దిద్దుకున్న రోజు...
నా ప్రేమ పుష్పం ప్రభవించిన రోజు...
ఈ రోజు... నా దేవేరి పుట్టిన రోజు!!

Friday, April 23, 2010

మౌనం మిగిలిపోయే...

కలలా కరిగిపోయే...
కథలో కలిసిపోయే...

మనసే చెదిరిపోయే...
మదికే గాయమాయే..

మాటలు మూగపోయే...
మౌనం మిగిలిపోయే...

తపనలు ఆగిపోయే...
తనువే శిధిలమాయే...

పగలే చీకటాయే...
చీకటే లోకమాయే...

ప్రాణం విడిచిపోయే...
పయనం ఆగిపోయే!!

Monday, March 29, 2010

నా ఆత్మ గురువు నిజ దర్శనంపొందిన వేళ...

ఏకలవ్యుణ్ణి కాకపోయినా...
ఏకమనసున తనను నిల్పి...
దృష్టి పథమున... తన పదమును చేరి...
అక్షరాల అల్లికలలో... భావాల బంగిమలను కూర్చే...
మెలుకువలు నేర్చుకుంటున్న నాకు...

మహాత్ బాగ్యమై...
నా ఆత్మ గురువు నిజ దర్శనంపొందిన వేళ...
అందని ఆకాశాన్ని చేరి...
అంతులేని అనందాన తేలి...
మురిసే మనసు మౌనాన...
పుట్టిన ప్రతి అక్షరం... ఓ కుసుమమై...
తన పాదాలను అలంకరిస్తున్నాయి!!

ఇన్నాళ్ళు నాలో నన్ను కలవరపెట్టిన...
ఎన్నో ప్రశ్నలు ముడులు విప్పుకొని....
ముంగిట నిల్చుంటే మాటలు లేక...
మౌనంగా వాటిని మనసున పదిలంగా దాచుకున్న!!
తెలియని ఉద్వేగాన...
తీరని సందేహాన...
తికమక నడకలతో...
కవితావనంలో దిక్కుతోచక...
తిరుగుతున్న నాకు...
దిశను తెలిపిన దూర్జటి తానూ!!

తన మాటలు మహిమలు...
నా మనసున పని చేస్తున్నాయి...
జగమంతా కుటుంబం నాదని...
ఏకాకిని కాదని...మనసుకి ఏకాంతమే వరమని!!
చెపుతున్నాయి!!

Monday, January 25, 2010

పవిత్ర ప్రేమకి పరిపూర్ణ క్షణాలు!!

తోలి రాతిరి...
తెల్ల చీరలో... మల్లె పూలతో...
తన తోలి అడుగుల సవ్వడి...
రేపే నాలో తుది లేని అలజడి!!

కోటి కోరికలు మనసున కొలువుతీరగా...
తియ్యని తలపులు తెచ్చిన తిమ్మిరులు...
తీరని ఆశ తీరే వరకు తిరిగి పోనంటుంటే...
సిగ్గులు మబ్బుల మాటున
తన లేత చెక్కిళ్ళ ఎరుపుల మెరుపులు...
నా అర చేతుల్లో దాచిన తరుణాలు!!


నా మునివేళ్ళ స్పర్శలో...
మైమరపున మూసిన...
తన చిలిపి కన్నులు తెలిపే...
కన్నె సొగసులు సొంతం చేసుకోమని స్వాగతాలు!!
ఆ స్వాగతాల సరసులో తడిసి...
అర తెరిచిన నా ఇరు కనులు...
తెరిచే సరస సౌధానికి తోలి తలుపులు!!


ఇరువురి శ్వాసలు...
ఇద్దరి మేనులలో...
వెచ్చని తాపాన్ని రగులుస్తూ...
నా నిచ్వాస తన ఉచ్వాసగా మార్చేస్తుంటే...
వణికే పెదవులు నాలుగు...
పరస్పరం పరిచయం కోసం...
పలువరించే క్షణాలు!!

ఆ పరిచయం మీరి...

పెనవేసుకుపోయిన పెదవులు...
ఇరు తనువుల దూరాన్ని దూరం చేస్తూ...
చిరుగాలిని సైతం దూరనివ్వక...
అల్లుకుపోయే ఆత్రాలు!!

మనువున ఏకమైన...
ఇరు మనసులు...
తనువున సైతం...
ఒకరికొకరు లోంగిపోతూ...
ఒకరినొకరు గెలుచుకుంటూ...

ఒకరిలో ఒకరు ఐక్యమైయ్యే
పవిత్ర ప్రేమకి పరిపూర్ణ క్షణాలు!!

Friday, January 8, 2010

సంకురాతిరి సంబరాల సమయమిది...

నేలతల్లి నడుము వొంచి...
వరి సిరుల నొంపగా...
గరిసెలు నిండే గడియలు అవి!!

పాత వస్తువులు...
పనికిరానీ పనిముట్లు...
పోగేసి అగ్ని దేవుడికి అర్పిస్తూ...
వణికించే చలి పులికి...
మంటల సెగలనంటిస్తూ...
కేరింతలు కొట్టే కాలమది!!
చీకటిలా ముసిరిన బాధలకు ముడితీస్తూ...
వేకువ వెలుతురులు తెచ్చే వెలుగు రేకులవి!!

గత కాలపు గాయాలను మాన్పి...
గుండెల నిండా సరికొత్త ఆశలను...
నింపుకునే తరుణమది!!

ఇంటింట సందడి...
ఊరంతా సంతోషాల సవ్వడి!!
చుట్టాలందరూ ఒకే ఇంట చేరి...
ఆప్యాయతను పంచుకుంటూ...
ఆదమరిచి ఆనందన మునిగితేలే ఆస్వాదన అది!!

అదే సంబరాలకు సమయమైన సంకురాతిరి!!

Sunday, January 3, 2010

చిలిపై.... చెలిమై...

చిలిపై....
చెలిమై...
చెంతకు చేరింది!!
మగువై...
మనువై...
మనసుని ముడివేసింది!!

Saturday, January 2, 2010

ప్రతిక్షణం నీ కోసం...

ప్రతిక్షణం నీ కోసం...
పరితపించే నా మనసునడుగు!!

అనుక్షణం నీకోసం...
అన్వేషించే నా ఆలోచనగుడు!!

నువ్వు ఎదురైతే...
నవ్వులు పూచే నా పెదవులనడుగు!!

నువ్వు పలకరిస్తే...
తడబడే నా మాటలనడుగు!!

తెలుపుతాయి అవి నీకు...
నీకై తలచిన తలపులు ఎన్నో!!
నీకై వగచిన వేళలు ఎన్నో!!
నీకై దాచిన వలపులు ఎన్నో!!