Friday, January 8, 2010

సంకురాతిరి సంబరాల సమయమిది...

నేలతల్లి నడుము వొంచి...
వరి సిరుల నొంపగా...
గరిసెలు నిండే గడియలు అవి!!

పాత వస్తువులు...
పనికిరానీ పనిముట్లు...
పోగేసి అగ్ని దేవుడికి అర్పిస్తూ...
వణికించే చలి పులికి...
మంటల సెగలనంటిస్తూ...
కేరింతలు కొట్టే కాలమది!!
చీకటిలా ముసిరిన బాధలకు ముడితీస్తూ...
వేకువ వెలుతురులు తెచ్చే వెలుగు రేకులవి!!

గత కాలపు గాయాలను మాన్పి...
గుండెల నిండా సరికొత్త ఆశలను...
నింపుకునే తరుణమది!!

ఇంటింట సందడి...
ఊరంతా సంతోషాల సవ్వడి!!
చుట్టాలందరూ ఒకే ఇంట చేరి...
ఆప్యాయతను పంచుకుంటూ...
ఆదమరిచి ఆనందన మునిగితేలే ఆస్వాదన అది!!

అదే సంబరాలకు సమయమైన సంకురాతిరి!!

2 comments: