Monday, January 25, 2010

పవిత్ర ప్రేమకి పరిపూర్ణ క్షణాలు!!

తోలి రాతిరి...
తెల్ల చీరలో... మల్లె పూలతో...
తన తోలి అడుగుల సవ్వడి...
రేపే నాలో తుది లేని అలజడి!!

కోటి కోరికలు మనసున కొలువుతీరగా...
తియ్యని తలపులు తెచ్చిన తిమ్మిరులు...
తీరని ఆశ తీరే వరకు తిరిగి పోనంటుంటే...
సిగ్గులు మబ్బుల మాటున
తన లేత చెక్కిళ్ళ ఎరుపుల మెరుపులు...
నా అర చేతుల్లో దాచిన తరుణాలు!!


నా మునివేళ్ళ స్పర్శలో...
మైమరపున మూసిన...
తన చిలిపి కన్నులు తెలిపే...
కన్నె సొగసులు సొంతం చేసుకోమని స్వాగతాలు!!
ఆ స్వాగతాల సరసులో తడిసి...
అర తెరిచిన నా ఇరు కనులు...
తెరిచే సరస సౌధానికి తోలి తలుపులు!!


ఇరువురి శ్వాసలు...
ఇద్దరి మేనులలో...
వెచ్చని తాపాన్ని రగులుస్తూ...
నా నిచ్వాస తన ఉచ్వాసగా మార్చేస్తుంటే...
వణికే పెదవులు నాలుగు...
పరస్పరం పరిచయం కోసం...
పలువరించే క్షణాలు!!

ఆ పరిచయం మీరి...

పెనవేసుకుపోయిన పెదవులు...
ఇరు తనువుల దూరాన్ని దూరం చేస్తూ...
చిరుగాలిని సైతం దూరనివ్వక...
అల్లుకుపోయే ఆత్రాలు!!

మనువున ఏకమైన...
ఇరు మనసులు...
తనువున సైతం...
ఒకరికొకరు లోంగిపోతూ...
ఒకరినొకరు గెలుచుకుంటూ...

ఒకరిలో ఒకరు ఐక్యమైయ్యే
పవిత్ర ప్రేమకి పరిపూర్ణ క్షణాలు!!

3 comments:

Unknown said...

pavithra premaku..sarasaanni cherchii.. nee rasika hrudayam tho daniki rasavatharamayna rangulu jodinchi..chaala ramyamugaa raasaavu...very nice....

JAI said...

so sweet, so cute, so hottttt

Anonymous said...

mee pavitra premaki paripoorna kshanalu ....sooo nice n sweet