నిదురించిన నయనాలలో నిజమయ్యే కలలు కదిలే...
కదిలిన కలలో వలచిన మగువ మెదిలే...
మెదిలిన మగువను గనిన మది మురిసే...
మురిసిన మదిలో తలపుల తోట విరిసే...
విరిసిన తోటలో వలపుల మధువులు కురిసే...
కురిసిన మధువులో తడిసిన మనసు తెలిపే...
తానే నా లోకమని...
తనకే నే సొంతమని...
తనతోనే నా గమనమని...
తనలోనే నా గమ్యమని...
అందుకే అందని తనని అందుకోమని....
అందకపోతే అలుపుచెందక...
పొందేవరకు పట్టువదలక ప్రయత్నించమంది!!
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
అందుకే అందని తనని అందుకోమని...
అందకపోతే అగ్నికి ఆహుతికమ్మని!!
మిగిలిన కవితంతా బాగుంది, కానీ చివరి పాదాలలో అంత నంస్పృహ ఎందుకుసార్.
నిస్పృహ కూడా ఒకందుకు మంచిదే అని నా అభిప్రాయం... అది మనకు వైరాగ్యపు ఆనందాని ఇస్తుంది....
యంత్రమల్లె సాగే ఈనాటి మనిషి జీవనంలో ఆ నిస్పృహలో అయిన తనకో మనసుందని...
అది పడే వేదన తెలుస్తూంది అని నా అభిప్రాయం. ఏమంటారు...?
అయిన మీకోసం ఆ పాదాన్ని మారుస్తాను క్రింది విదంగా... ఆశవాదంగా... :)
"అందుకే అందని తనని అందుకోమని....
అందకపోతే అలుపుచెందక...
పొందేవరకు పట్టువదలక ప్రయత్నించమంది!!"
దేనినైనా సాధించేందుకు ప్రయత్నలోపం లేకుండా చేయాలనేది నా ఉద్దేశ్యం. ఇప్పటికే ప్రేమ పేరుతొ జరుగుతున్న దారుణాలను చూస్తున్నాం కదా. ఎందుకో చదవగానే అవి గుర్తొచ్చాయి. మీరు మార్చిన కవితా పాదాలు బాగున్నాయి. మీ తక్షణ స్పందనకు ధన్యవాదాలు.
Post a Comment