గచ్చు నేల గుచ్చుకున్న...
పసిడి నిదురలు వచ్చు రోజులు...
మచ్చుకైన లేకపోయే...
పరుపు నిండ పత్తి నింపి...
మెత్తగుండేటట్టు చేసి...
మత్తునిద్రన మునిగి తేలే...
కునుకు తీద్దమంటే...
రాకుండే కాసింత నిద్దుర!!
కనుల నిండ కపట బుద్ది...
మనసు నిండ మాయ చేరి...
నిముషమైన నిలువవాయే...
నేలనిడిచి నింగి సాగే పిచ్చి నడకలు!!
గతము మరిచిన గుడ్డి జీవికి...
విగతమే బ్రతుకు నిండ...
విజ్ఞానమంటూ పరుగుతీస్తూ...
అజ్ఞానమందే బ్రతుకుతున్నాడు!!
వేల చుక్కల నడుమనోక్కటి...
చక్కగున్నది చందమామ అని...
చూసి మురిసే రోజు మాని...
తనను ఎక్కి తరుముతున్నడు...
ఏప చెట్టు కింద చేరి...
పత్తినోడికే ముసలి అవ్వని!!
విశ్వమంతును చూద్దమన్న...
వెర్రి యోచననొకటి చేసి...
యేగుతున్నడు స్థితిని మరిచి గతిని తెలియక...
అంతులేని విశ్వమందున తన అంతమయ్యే...
సాదనదియన్న సంగతే తెలియకుండా...
సాగుతున్నడు శాస్త్రమంటు చెప్పుకుంటూ...
మానవత్వం మరిచి... విడిచి...
మనిషితత్వం తుంగ తొక్కి...
పతనమౌతు విజయమంటుండు...
ఈనాటి ఈ కాలపు మనిషి!!
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Super ga chepparandi meeru
Post a Comment