ఈ కోమలి కలువ కన్నుల కాంతులు...
నా కలల నెచ్చెలివేనా!!
ఇది నిజమేనా... వరమై ఎదుట నిలిచెనా!!
ఇలలో ఉన్నానా... లేక కలలోనే ఉన్నానా!!
మనసుకు మాటరాక...
వయసుకు వీలుకాక...
చెప్పలేని భావనేదో...
చెంత చేరి చిత్రమేదో...
చేస్తుంది ఈ వేళన!!
అంతులేని ఆనందానికి...
అడ్డుచెప్పక నిల్చున్న ఈ క్షణాన!!
తొలివరమో... మరి చలి జ్వరమో...
తెలియని తికమకలో నే వున్నా!!
ఇలను మరిచి...కలను విడిచి...
ఈ క్షణమో...మరో క్షణమో...
ఆమె వశమైపోతున్నా... తన వెనకే వెళుతున్నా!!
ఇది తనకు విన్నవించాలన్న అభిలాషకు...
ఆరాటం అధికమౌతున్న...
అది వివరించే భాష తెలియక...
మౌనమే మాట చేసుకున్న!!
చూపులకు పలుకులిచ్చి...
నా ఎద పిలుపులు తనకు తెలుపుతున్న!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment