Monday, December 7, 2009

ఒకే ఒక మాట...

ఒకే ఒక మాట...
పదే పదే నే పలుకుతూ వున్నా!!
చిరాకు చెందకే బాల..
పరాకున వుండకే ఇలా!!

అలాగని నీ మనసుని ఏదో...
దోచేస్తానని దాచేయ్యకే భామ!!
ఆ మనసుకి నా వేదన నివేదించనీమ్మ!!

నీవే నా ఆశకు రూపం!!
అదే నా ప్రేమకు దీపం!!

పెదాల్లో పలికిన బావం...
నరాల్లో మీటెను నాదం!!
అదే కదా ప్రేమంటున్న...
మరి ఏ కధ నీ ఎద విననటుందా !!ఒకే ఒక మాట!!

2 comments:

Sandeep P said...

బాగుంది అండి. భాష మీద ఇంకా పట్టు సాధిస్తారు అని ఆశిస్తున్నాను.

Naren said...

మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు సందీప్ గారు...
తప్పకుండా...
మీరు ఆశించిన దానిని అందుకోడానికి ప్రయత్నిస్తా!!

మీరు రాసిన "తేట తెలుగు పాట" అనే బ్లాగ్ లో వేటూరి గారి పాటలను ఎంతో వివరణాత్మకంగా విశ్లేషించారు.
నేను కూడా ఆ పదబ్రహ్మ కి తనకున్న అశేష అభిమానుల్లో ఓ అనామక అభిమానిని!!