వయసొచ్చి విరిసిన మనసుని, ముదమున మదనుడు విసిరిన విరుల శరము తగిలినవేళ నుండి...
కవితాసీమలో కలల కౌముదిలో కదిలిన కలహంస చిత్రం!!
ఊహల ఊయలలో ఊరేగిన ఊపిరి ఊహా చిత్రం!!
మగతలో వున్నా మనసుకి మరో జగంలో మెదిలిన మనోజ్ఞ చిత్రం!!
ఆ చిత్త్తరువు చిత్తగించి...
ఇలలో తనకై సాగింది అన్వేషణ ఆ వేళ నుండే..!!
ఆ అన్వేషణలో...
తనకై పరిగెడుతున్న మనసుని పోదివిపట్టలేక పోగొట్టుకున్న!!
వినని మనసుని విడువలేక విచ్చిన్నమౌతున్న!!
ఆ మనసుకై వెదుకాలో... అది వెదికే నా తరుణీ కై వెదుకాలో..
తెలియని సంకట సందిద్గస్థితి!!
ఇరువిరి అన్వేషణ ఇరుకున పెడుతున్న...
ఊరించే ఉడుకు ఊహలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న...
ఏకాకి ఎద ఏకాంతపు వలలో గిలగిలాడుతున్న...
ఒంటరి వయసుని వలపుతలపులు వేదిస్తున్న..
ఆగలేదు... ఆపలేదు...
నా తరళేక్షణ కై అన్వేషణ!!
వేకువ తొలి వెలుగులలో ఆమె జిలుగులు వెదుకుతున్న!!
చీకటి మినుగురుల మినుకువలలో ఆమె కన్నుల కాంతులు వెదుకుతున్న!!
ఆమని ఆగమనం లో ఆమె గమనం వెదుకుతున్న!!
ఆ కడలి కదలికలలో ఆమె నడకలు వెదుకుతున్న!!
సెలయేటి ఆనకట్టులో ఆమె చీరకట్టును వెదుకుతున్న!!
నిశిరాతిరి నీడలో... నిరాచారినై నిరూపణలేని ఆమె రూపునకై వెదుకుతున్న!!
నింగి నిర్జరుడు నిర్దయుడైన... నిర్గమించక...
వేల కోట్ల తారలలో ఆమె తలపుల సితారలకై వెదుకుతున్న!!
నయాగర నడకలలో ఆమె నడుము నయగారముకై వెదుకుతున్న!!
మాఘమాసపు మల్లెల తోటలో ఆమె మేని పరిమళముకై వెదుకుతున్న!!
చలికాలపు చల్లని రేయిలో ఆమె వెచ్చని ఊపిరులకై వెదుకుతున్న!!
ఎంత వెదికిన తెలియకుంది ఎడుందో యా తరుణీ...
ఐన నిదురలేక... మరుపురాక వెదుకుతున్నఆ తరుణంలో...
నాకోసమే వెదుకుతూ వరసై, వదువై వస్తున్న తనని చూసి నిశ్చేష్టుడనవుతున్న!!
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
extraordinary literature.. awesome composition.. this is the best epic i saw ever wid u dude!!!
Post a Comment