Saturday, October 24, 2009

నే చేరలేని దూరాన నువ్వున్నా...

నే చేరలేని దూరాన నువ్వున్నా...
నిన్ను చేరే ఆ క్షణం కోసమే...
వేల కన్నులతో నిరీక్షిస్తున్న...
వేయి కరములుసాచి వేచివున్న!!

ఏకాంతపు క్షణాలు...
నీతో గడిపిన గతకాలపు మధురాలను...
గుర్తుకు తెస్తుంటే...
ఈ దూరం బారమౌతుంది...
ఆ బారం భరించలేక నా సగభాగం నీకిచేయ్యాలన్న...
ఆరాటం అధికమౌతున్న తరుణాన...

ప్రతిక్షణం నువ్వు... అనుక్షణం నీ నవ్వు...
క్షణక్షణం నన్ను నీ విరహంలో ముంచివేస్తుంది!!
మరుక్షణం నీ ద్యాసలో నన్ను దాచేస్తుంది!!

2 comments:

కెక్యూబ్ వర్మ said...

నిరీక్షణ లేకపోతె, విరహంతో మరగకపోతే ప్రేమకైనా దేనికైనా మనకు అనుభూతికలగదు. అప్పుడే వాటి తీయదనం అనుభవ౦లోకి వస్తుంది. కాదంటారా?
మీ బ్లాగు నేను చాన్నాళ్ళుగా ఫాలో అవుతున్నా? నా సహచరుడు బ్లాగులో గాడ్జెట్స్లో కుడా కనిపిస్తుంది. మీ ప్రొఫైల్ ఫోటో నైస్. వేరి గుడ్ లుకింగ్...అనకుండా ఉండలేకపోయా..

Naren said...

మీరు చెప్పింది అక్షరాల నిజం...

అలా మరిగినప్పుడే కదా...
ఆ మరిగి కరిగిన మనసుని...
పుత్తడి వెలుగుల నిత్యపు కాంతుల...
మణిహారం చేసి ఆ ప్రణయ దేవతకు కానుకగా ఇవ్వగలిగేది...

మీ కంప్లేమేంట్ కి చాలా థాంక్స్..!! :)

నేను మీ కవితలు చదివాను చాల బాగున్న...నా కామెంట్స్ కూడా పోస్ట్ చేశాను...