Tuesday, December 29, 2009

సాగించు నీ సాదన...

గడిచిన కాలం చేసిన గాయం...
పదే పదే పలవరిస్తూ...
గతి తెలియక గదిలోనే...
గడిపేయకు కాలాన్ని!!

కనికరం చూపక ఆగక సాగే...
ఆ కాలాన్ని సైతం కలవరపెట్టే...
ఓ కనికట్టుని నువ్వు కనిపెట్టు...
ఆ గాయం చేసిన గుర్తులను...
పరిశోధించి... పరిశీలించి!!

నీ ఆపేక్షను ఉపేక్షింపక...
సాగించు నీ సాదన...
నీ లక్షాన్ని సాదించే వరకు...
ఎంత యాతన ఎదురైనా!!

ఆపకు నీ పయనం...
ఆ గమ్యం చేరే వరకు
ఎన్ని ఎండమావులు ఎదురైనా!!

ఆరని గాయాలు సైతం అవుతాయి...
తీపి జ్ఞాపకాలు ఆ గమ్యం చేరినాక!!

Thursday, December 17, 2009

ప్రాపంచిక ఆశలనెడి పసిడి లేడులు...

ప్రాపంచిక ఆశలనెడి పసిడి లేడి...
కనుల ముందు కదిలియాడి...
మనసనేడి సీతను...
మాయ చేసి... మదిని దోచే!!

సతిని కోరికను సాదించ యేగినాడు...
ఆ మనసు ఏలికయైన ఆత్మరాముడు...
జ్ఞానమనేడి లక్ష్మణున్ని తోడు వుంచి!!

గడియలు గడిచిన రాని పతికై...
తోడున్న తెలివిని సైతం తరిమే...
గుబులు చెందిన ఆ గుడ్డి మనసు!!

అలా ఒంటరైన మనసు...
దిషణమనెడి విభీషణుడి...
అగ్రజుడైన అహమనేడి రావణుడి...
మాయ చెరలో చిక్కి...
శోక వనమున విలపించే...
బుద్ది గీసిన రక్షా రేఖను మీరినందున!!

Sunday, December 13, 2009

జతనేలు జాబిలమ్మకై అన్వేషణ

ప్రాయం యవ్వన తీరాన...
తోలి అడుగులు మెదలేట్టిన నిమిషాన!!

చల్లని పిల్ల గాలి మెల్లగా...
తరుణుల మేని పరిమళాన్ని మోసుకొస్తున్న తరుణాన!!

వలపుల సంద్రపు తలపుల తోలి అలలు...
మనసుని తాకి మలినం చేస్తున్న మైకాన...
వయసుకు పుట్టే కొత్త కోరికలు!!

శతవేల తారకల నడుమ తన...
జతనేలు జాబిలమ్మకై అన్వేషణ మొదలైన ముహూర్తాన...
ఈ కుర్రవయసుకు కొత్తగా కలిగెను కొంటెతనాలు!!

Saturday, December 12, 2009

నీ తీపి విరహాల వీలునామా...

మల్లెల మత్తులను హత్తుకొని...
నీ అర కన్నుల కైపులు...
నా ఎదకేసే మన్మద పూల బాణాలు!!

నీ ముని పంటి నడుమ నలిగిన నీ పెదవంచు....
తెలిపే నీ తీపి విరహాల వీలునామా...
ఆ అదిరే అధరాలు నా సొంతం...
అవి చిందే మధువులు నా సొంతం... అని !!

నీ చూపుల... నీ రూపుల తడిలో తడిసి...
వేడెక్కిన నా ఊపిరి నీ మేని తాకేందుకు...
ఎదురు చూస్తున్నది... వేగిపోతున్నది!!

సిగ్గుల తెర మాటున ఎరుపెక్కిన నీ బుగ్గలు...
నా పెదవుల స్పర్శను స్వాగతిస్తున్నాయి...
సన్నాయి రాగాన... సుతిమెత్తని గీతాన!!

Monday, December 7, 2009

ఒకే ఒక మాట...

ఒకే ఒక మాట...
పదే పదే నే పలుకుతూ వున్నా!!
చిరాకు చెందకే బాల..
పరాకున వుండకే ఇలా!!

అలాగని నీ మనసుని ఏదో...
దోచేస్తానని దాచేయ్యకే భామ!!
ఆ మనసుకి నా వేదన నివేదించనీమ్మ!!

నీవే నా ఆశకు రూపం!!
అదే నా ప్రేమకు దీపం!!

పెదాల్లో పలికిన బావం...
నరాల్లో మీటెను నాదం!!
అదే కదా ప్రేమంటున్న...
మరి ఏ కధ నీ ఎద విననటుందా !!ఒకే ఒక మాట!!

Saturday, December 5, 2009

సొగసరి చూపులు....

నీ చివరంచు చూపు చాలు...
చివురించు నా ఆశల పూల తోటలు!!
నీ పెదవంచు పిలుపు చాలు...
పండిపోవు పసిడి వలపుల పంటలు!!

ఆ సొగసరి చూపులు నా సొంతం!!
ఆ పెదవుల మదువులు నా సొంతం!!

Monday, November 30, 2009

నీ లోక రాకను మరువకే మనసా!!

జగత్తు మహత్తు ఎరుగవే మనసా!!
ఎరిగిన ఎరుకను ఏలవే మనసా!!
ఏలిన ఎరుకను విడువవే మనసా!!
బయలుకు బాటను వేయవే మనసా!!

ఆహామునిడిచి ఇహ మందునాశ నొదిలి...
నీ దేహమందున్న ఆ దేహిని కనుగొనవే మనసా!!
ఆ బ్రహ్మమందునే పరబ్రహ్మముందని తెలియవే మనసా!!

లోకమాయలో మునిగి తేలి...
నీ లోక రాకను మరువకే మనసా!!

ఆరు చక్రాల బండి కట్టి...
ఏడు గుర్రాల కళ్ళెమేసి...
పరబ్రహ్మమును చేరు త్రోవలో...
పయనించవే మనసా!!

సరసాల సార్వభౌమ...

సరసాల సార్వభౌమ విరహాలు విడిరార!!
నాలోని అణువు అణువుకు...
నీ వెచ్చని స్పర్శని పరిచయం చేసి పోర!!

అందాల అవయవాలు ఆనందాన అలసిపోగా...
సోయగాల సోకు తీర్చరార!!

తనువంతా తపనల తహతహ నిండిపోగా...
ఊహల్లో ఏదేదో చేసినావు...
శిఖరాలు చేర్చినావు!!

ఇక ఆగలేనురా సుందర...
జాగుసేయక నన్ను అల్లెయరా ముందర!!

దాచాలేనురా ఇక...
దాగని సొగసుల దాపరికం!!
దరి చేరి అవి దోచేయ్యరా నా దొర!!

Sunday, November 29, 2009

వెన్నెల్లో తీరం...

వెన్నెల్లో తీరం...
గుండెల్లో బారం...
నీకోసమే వేచెనే!!
నిన్నే నే వలచి...
నీ మది గెలిచి...
నీ దరి చేరే క్షణమే ఒక వరం!!

నా ప్రాణం నీవే...
నా గానం నీవే...
నాలో వున్న ఆశకు భావం నీవే...
నీవే నీవే నీవే.. నీవే...
ఎన్నో ఊసులు ఏవేవో బాసలు...
ఇన్నిన్ని కలలకు భావం తెలిపే...
ఏనాడూ లేని ఈ కొత్త భావం...
కలిగింది నాలో నేడే...
కురిసెను మనసున మల్లెల వానలు ఈనాడే...
నాలోని కన్నుల మెరుపులు...
చిలికిన పలుకులు పలికిన గుసగుసలు....
అవి నీవేనమ్మ... నాలోనే కొలువున్న బొమ్మ!!

ఏ రోజులోనా ఈ రోజులాగా లేదేమే ఈనాటి వరకు!!
తెలిసింది కొత్తగా మురిసింది నా ఎద ఆ వేళలోన!!

కలకాలం మరి నాతోడు...
మరి నువుండే...
క్షణమే నాకొక వరమనుకున్న!!
ఆ వరమున నేను తడిసిన వేళ...
పెరిగెను నాలో తపనల తొందరలు!!

నీకోసమే నేను వున్న!!

కాదని అన్న...
కాదనుకున్న...
నీకోసమే నేను వున్న!!

వలదని అన్న...
విసుగనుకున్న...
నా వలపంత నీదే అంటున్న!!

మది నీ రాకను స్వాగతిస్తుంటే...
మరి నిరాకరిస్తావో...
నిజమై నన్నే వరిస్తావో...
తెలిపే క్షణం కోసం...
ఎదురుచూపుల చెరలో బందినై నేవున్న!!

Monday, November 23, 2009

ఇది ప్రళయమో... లేక ప్రణయమో!!

నిన్ను చూసిన తోలి క్షణమే...
మనసు మతి తప్పి నీ నామమే జపిస్తుంటే...
చూపులు గతి తప్పి నీ చిలిపి నవ్వుల అంచులలో నిలిచిపోతే...

అది,
కొత్తగా వయసొచ్చి...
మదిలో ఘనిభవించిన...
కోరికల జలపాతం...
నీ మేని మెరుపుల కాంతుల సోకిన...
ఆ వెండి కాంతుల వెచ్చదనంలో కరిగి...
నీ పిచ్చిలోనే ఉన్న మనసుని తడిపి ముద్దచేస్తుంటే...
ఆ తపనలు తడి తెచ్చిన...
అరుదైన ఆకర్షణ అనుకున్న...
ఆ ఆకర్షణలో కలిగే ఎన్నో ఆలుపెరుగని ఆలోచనలు!!
ఆ ఆలోచనలో రగిలే ఎన్నో అంతులేని ఆవేదనలు!!
అలా రగిలిన వేదనలో చెప్పలేని విరహం...
విరుల హారమేసి వరించింది!!
ఆ విరహంలో నిన్ను పొందే వరకు...
వీడని మగత మాయగా అవరిచింది!!
ఆ మాయలో మనసు మాటవినక...
కంటికి కునుకురాక...
వయసు పోరు పడలేక...
సతమతమౌతున్న!!
ఇది ప్రళయమో... లేక ప్రణయమో...
నువ్వే నిర్ణయించు... నా దిశను నిర్దేశించు!!

Friday, November 20, 2009

మనసైన మంచుకొమ్మ!!

అందాల హంసలేఖ...
రాశాను ఆగలేక!!
మనసైన మంచుకొమ్మ...
మనువాడా వేగిరామ్మ!!

వలచాను నిన్ను నేను...
తొలిచూపు పిలుపులోనే!!

విరహాన వేగలేక...
ఈ వలపంత దాచలేక...
నే మునిగిపోతూ ఉన్న...
ఏ దారి కానరాక...
తలపుల గోదారిలోన!!

తెర చాటు నుండిపోక...
తెర చాపలాగ అల్లి...
సరసాల నావలోన...
శృంగార తీరమేదో నను చేర్చరామ్మ!!

Tuesday, November 17, 2009

మా అన్న!!

శ్రీరాముడంటి మా అన్న వెంట...
ఆ లక్ష్మణుడల్లె జతగా నే వెళ్ళలేకున్నా...
భరతుడినై తను వదిలేళ్లిన...
అడుగు జాడలు...
నా మది ఏలిక చేసుకొని...
తన రాకకై బారంగా బ్రతికేస్తున్న!!

మా అమ్మలోని ఆ అమృతత్వం...
నాన్నలోని ఈ నడిపేతత్వం...
కలగలిపి మా అన్న...
ఆ మనసు వెన్న!!

నే వేసే ప్రతి అడుగు నిర్దేశించే నేప్పరి తానూ!!
అలసిన మనసుకు ఆసరా తానూ!!

దిగులు కలిగిన వేళ నేస్తమల్లే...
చేరదీసి సేదతీర్చే స్నేహితుడు తానూ!!

నా ప్రతి మాటలో తానూ!!
నే నడిచే బాటకు బాసట తానూ!!

నలు దిక్కులలో నే దిక్కు తోచక...
నిలుచున్న నిమిషాన...
గమ్యం చేర్పే నా దిక్కు తానూ!!

నాలో నాకంటే నా అన్నకై పరితపించే...
ఆకాంక్షలు ఎన్నో... ఆశలు ఎన్నో!!
అవి అపురూపాలు... అనిర్వచనీయాలు!!

నిన్ను కోరే నా శ్వాస

నా నిరీక్షణకు అంతం నువ్వు...
ఈ లోకాన నాకున్న ఒకే ఒక్క ఆశవు నువ్వు!!

నువ్వూ నన్ను ప్రేమిస్తున్నావు...
అని నా హృది ప్రతి కదలిక చెపుతుంది...
అది కల కాదని, నిజమే అని...
వేదించే నీ ఆలోచనలను మరిపించే...
నీ చల్లని చూపుల పలుకులతో...
నా మదిని పూదోట చేసే...
ఆ చిన్న మాట చెప్పెస్తావని!!

ఆలోచనలో అలసిన మనసు...
విరహంలో వేసారిన హృదయం...
నీ ప్రేమలో ఆ వేదనలన్నీ మరిచి...
పరవశాన మైమరచిపోవాలి!!

అని అంటోందో నిన్ను కోరే నా శ్వాస!!

Sunday, November 15, 2009

బీటలు లెక్కిన మది మాగాణి!!

బ్రతుకు నిండా బరువు నింపే బాధలేన్నో...
చిన్న ఓదార్పు కోసం మొగమాసిన మనసు..
ఆ మనసు విప్పి చెప్పుకునే ఓ మనిషి తోడు లేక...
నిరాశపు ఎండల వేడిమిలో...
బీటలు బారిన ఈ అనాధ జీవి...
మది మాగాణిలో...
ఓ ప్రేమ దేవత చిలికిన వలపు చినుకులు...
తెనేదారలై... నదిలా మార్చేస్తుంటే...
ఎప్పుడో ఇంకిన ఆ కన్నీటి సంద్రంలో...
ఈ ప్రేమ నది వచ్చి చేరిన క్షణం...
ఆ క్షణం ఎగిసిను లెక్కలేని...
ఆనందపు కెరటాలు ఎన్నో...
మనసుని చిద్రం చేసే అలుపెరుగని...
ఆలోచనలకి సాంత్వన అవి..
అవి మనసుని తడిపి ముద్ద చేస్తుంటే...
మాటలకందని భావం అది...
కన్నీటి వరద అది...
సుఖమైన దుఖం అది...
నిజమై చేరిన కల అది...
అధికమైన ఆవేదనకు అంతం అది...
అంతులేని అపేక్షకి ఆది అది!!

Thursday, November 12, 2009

నా ఎద పిలుపులు

ఈ కోమలి కలువ కన్నుల కాంతులు...
నా కలల నెచ్చెలివేనా!!
ఇది నిజమేనా... వరమై ఎదుట నిలిచెనా!!
ఇలలో ఉన్నానా... లేక కలలోనే ఉన్నానా!!

మనసుకు మాటరాక...
వయసుకు వీలుకాక...
చెప్పలేని భావనేదో...
చెంత చేరి చిత్రమేదో...
చేస్తుంది ఈ వేళన!!
అంతులేని ఆనందానికి...
అడ్డుచెప్పక నిల్చున్న ఈ క్షణాన!!

తొలివరమో... మరి చలి జ్వరమో...
తెలియని తికమకలో నే వున్నా!!
ఇలను మరిచి...కలను విడిచి...
ఈ క్షణమో...మరో క్షణమో...
ఆమె వశమైపోతున్నా... తన వెనకే వెళుతున్నా!!

ఇది తనకు విన్నవించాలన్న అభిలాషకు...
ఆరాటం అధికమౌతున్న...
అది వివరించే భాష తెలియక...
మౌనమే మాట చేసుకున్న!!
చూపులకు పలుకులిచ్చి...
నా ఎద పిలుపులు తనకు తెలుపుతున్న!!

Monday, November 9, 2009

వీరాంజనేయ!!

అంజని పుత్ర... అభయాధినేత...
వీరాంజనేయ... విమలప్రదాత...
విజయానికేత... శ్రీహనుమంతా!!

అకుంటిత దీక్షకు మారు నువ్వు... ఓ మారుతి!!
రామనామ జపమే కదా బహుప్రీతి నీ జిహ్వకి!!
ఆ సీతారాముల కొలువే కదా నీ మనసంతా!!
శ్రీరామ సేవకే అంకితమంటివి జన్మంతా!!

మనసున మైమరిచినావు...
మృదుమధురమైన శ్రీరామ గానామృత ఆలాపనలో!!
తపమున తరించినావు...
తనువున అణువణువున ప్రతిధ్వనించే రామనామ స్మరణలో!!

దుష్ట చేష్టలు దరి చేరవంట... నువ్వు కొలువున్న ఇంటా!!
బయానికి అభయమిచ్చునంట నీ హనుమాన్ చాలీసా!!

Saturday, November 7, 2009

నా చిట్టి తల్లి... చిన్నారి చెల్లి!!

అమ్మకు ప్రతిరూపం...
నాన్నకు సిరిదీపం...
నా మనసున మణిదీపం...
నా ముద్దుల చెల్లి... మా బంగారు తల్లి!!

ఆ మింటి జాబిల్లి...
మా ఇంటికొచ్చింది...
వేవేల వెన్నెల్ల వెలుగుల్లు...
తెచ్చింది మా కంటికి!!

పువ్వల్లె ఎదిగింది మా ఇంటా...
పంటయ్యి ఒదిగింది మెట్టింటా!!

సకల దేవతల సంకలన రూపం...
సమస్త సంతోషాల సమాహారం...
నా చిట్టి తల్లి... చిన్నారి చెల్లి!!

మా కంటి వెలుగులో కొలువున్న తల్లికి...
కొండంతా అండల్లె కడవరకు నేనుంటా!!

Thursday, November 5, 2009

మా అమ్మానాన్నలు!!

సృష్టిలోని ప్రతి జీవికి మొదటి స్ఫూర్తి నాన్న...
ఆ స్ఫూర్తి నడిపే దారిన వెలుగులు నింపే...
ఆరని దీపం అమ్మ!!

అమ్మంటే ఆశావాదం...
నాన్నంటే నడిపే పాదం!!

అమ్మ నేలైతే... నాన్న నింగైతే...
వారి ప్రేమలో పండిన పసిడి పంటలు మేమంటా!!

నిద్దురపుచేందుకు అమ్మ పాడే జోల పాట...
ఆ అమృతంకన్న మిన్న!!
ఎదిగే వయసుకు నాన్న చూపే బాట....
జీవితపు ఆటలో గెలుపును తెచ్చే పూదోట!!

మా మనసు కలత చెందితే కన్నీళ్ళు ఆ కళ్ళలో...
మా ఆనందంలో తమ ఆనందం వెతుకుంటూ...
వారికంటూ ఏమి చూసుకోక...
ప్రతిక్షణం మా కోసం పరితప్పించే ఆ త్యాగజీవులకు...
ఏమిచ్చి తీర్చగలను... ఈ ఋణం!!
ఇది ఆ వరాలిచ్చే దేవుడైన పొందలేని ఒక గొప్ప వరం!!

శతకోటి దేవతల ఏకరూపు మా అమ్మానాన్నలు...
వారిని నిత్యం పూజించే పూజారిని నేను...
విడిచి దూరంగా వెళ్ళలేను!!

అలాంటి అమృతమూర్తులకి...
అవసాన దశలో అమ్మనాన్నని నేనౌతా!!
వయసు తెచ్చే వైరాగ్యపు చీకట్లను తరిమే...
అశాదీపపు వేకువ వెలుగును నేనౌతా!!
సత్తువుడిగి... కదల్చలేని పాదాలకు...
కదలిక తెచ్చి నడిపించే మూడోపాదం నేనౌతా!!

Wednesday, November 4, 2009

నా దేవేరి కావలి!!

ఊర్వశి చిన్నెలు... మేనక వన్నెలు ఏమి వద్దు...
నా చూపుల వేడిమిలో...
ఎరుపెక్కిన బుగ్గలలో మొలక సిగ్గులు చాలు!!

కలువ కన్నులు కానక్కరలేదు...
నను కనుపాపలలో దాచుకునే కాటుక కన్నులు చాలు!!

లోకంలోని అందాలన్నీ తనలో ఉండాలనిలేదు...
తన లోకమే నేను అయితే చాలు!!

నింగిన తారకనో... నేలన మల్లికనో కానవసరం లేదు...
మూర మల్లెలు కొప్పునపెట్టి...
ఆ తారలోచ్చు వేళ నా ముంగిట నిలిచితే చాలు!!

రాయంచ నడకలు... రాచిలుక పలుకులు రావాలని లేదు...
నాతోడై... నీడై... నాలో సగమై...
నామాటకు పదమై...
నా ఆశకు అడుగై...
నాతో నూరేళ్ళు నడిచే...
నా దేవేరి కావలి!!

Monday, November 2, 2009

మనసు నిండ మృత్యుఘోష

యాంత్రికమైన ఈనాటి మనిషి జీవనంలో....
తనలో ఉన్న బుద్దిని, జ్ఞానాన్ని...
నిరాశపు ఆలోచనలు కమ్మేసినప్పుడు...
గాయపడిన మనసుకి మాటలుండవు...
బుద్దికి చేతలుండవు...
ఆ క్షణం మనసు పడే అరణ్య వేదన... వినే చేవులున్నాయా ఈ లోకానికి!!

చెదిరిన మనసు బాధ చెప్పుకునే తోడులేక...
ఒంటరితనం మనసుని వెక్కిరిస్తుంటే...
కాలం ముందుకు సగానని మొండికేసి కూర్చుంటే...
నిరాశపు చీకట్లలో దారిని చూపే దిక్కులేక...
మనసు నిండ మృత్యుఘోష...
మౌనమే తన మాతృభాష...

ఆశలన్ని అంతమయ్యి...
ప్రాణమంటే తీపి లేక...
లోకమంతా శూన్యమయ్యి...
బ్రతుకు అంటే విలువ తెలియక...

అమ్మ నాన్నల ఆశల్ని...
తీర్చలేనేనన్న భీతినోంది...
చావులోన సుఖమునేతుకుతూ...

ఈ లోక బందం బారమయ్యి...
మృత్యువే తనకున్న బందువంటూ...
జోడుకట్టి సాగుతున్నాడు....
తన తనువునే చితిగా చేసి... ఆత్మనే ఆహుతిచ్చి!!

Saturday, October 31, 2009

ఈనాటి ఈ కాలపు మనిషి!!

గచ్చు నేల గుచ్చుకున్న...
పసిడి నిదురలు వచ్చు రోజులు...
మచ్చుకైన లేకపోయే...
పరుపు నిండ పత్తి నింపి...
మెత్తగుండేటట్టు చేసి...
మత్తునిద్రన మునిగి తేలే...
కునుకు తీద్దమంటే...
రాకుండే కాసింత నిద్దుర!!

కనుల నిండ కపట బుద్ది...
మనసు నిండ మాయ చేరి...
నిముషమైన నిలువవాయే...
నేలనిడిచి నింగి సాగే పిచ్చి నడకలు!!

గతము మరిచిన గుడ్డి జీవికి...
విగతమే బ్రతుకు నిండ...
విజ్ఞానమంటూ పరుగుతీస్తూ...
అజ్ఞానమందే బ్రతుకుతున్నాడు!!

వేల చుక్కల నడుమనోక్కటి...
చక్కగున్నది చందమామ అని...
చూసి మురిసే రోజు మాని...
తనను ఎక్కి తరుముతున్నడు...
ఏప చెట్టు కింద చేరి...
పత్తినోడికే ముసలి అవ్వని!!

విశ్వమంతును చూద్దమన్న...
వెర్రి యోచననొకటి చేసి...
యేగుతున్నడు స్థితిని మరిచి గతిని తెలియక...
అంతులేని విశ్వమందున తన అంతమయ్యే...
సాదనదియన్న సంగతే తెలియకుండా...
సాగుతున్నడు శాస్త్రమంటు చెప్పుకుంటూ...
మానవత్వం మరిచి... విడిచి...
మనిషితత్వం తుంగ తొక్కి...
పతనమౌతు విజయమంటుండు...
ఈనాటి ఈ కాలపు మనిషి!!

తానే నా లోకమని... తనకే నే సొంతమని...

నిదురించిన నయనాలలో నిజమయ్యే కలలు కదిలే...
కదిలిన కలలో వలచిన మగువ మెదిలే...
మెదిలిన మగువను గనిన మది మురిసే...
మురిసిన మదిలో తలపుల తోట విరిసే...
విరిసిన తోటలో వలపుల మధువులు కురిసే...
కురిసిన మధువులో తడిసిన మనసు తెలిపే...

తానే నా లోకమని...
తనకే నే సొంతమని...
తనతోనే నా గమనమని...
తనలోనే నా గమ్యమని...

అందుకే అందని తనని అందుకోమని....
అందకపోతే అలుపుచెందక...
పొందేవరకు పట్టువదలక ప్రయత్నించమంది!!

Thursday, October 29, 2009

మెరిసే నీ కన్నుల ప్రియ దరహాసాలు!!

మల్లెల మధు మాసాలు...
వెన్నెల వెలుగులలో సాగర సమీరాలు...
చల్లని వేసంగి వేకువలు...
వెచ్చని చలికాలపు ఉషోదయాలు...
మెరిసే నీ కన్నుల ప్రియ దరహాసాలు!!

Wednesday, October 28, 2009

ఓ ప్రేమికుడి ప్రేమ కథ !!

ఓ జిలిబిలి వెలుగుల జాబిల్లి...
నా కథ వింటావా... సొద అనుకోకా!!

నీ వెన్నెలలోన...
నా కన్నులలోన మెదిలిన...
ఓ కలలా నా కడకు చేరింది...
కథ మెదలెట్టింది... ఏదని తట్టి లేపింది...
ఆ మది మురిసింది... మనసుని తనకే అర్పించింది...
వయసుని తలపుల వానలో తడిపింది....
ఊసులెన్నొ చెప్పింది... ఊపిరే తానైతానంది...
అల్లరి ఆశలు రేపింది... ఆఖరి శ్వాసలో తోడై తానోస్తానంది...

ఇలా మాటలెన్నో చెప్పింది... మలుపులెన్నో తిప్పింది....
అవి నీకు చెబుతాను...
ఓ జిలిబిలి వెలుగుల జాబిల్లి...
ఆ కథ వింటావా... సొద అనుకోకా!!

తపనల తపసుమెచ్చి...
వరాలు తెచ్చిన దేవత తాననుకున్న...
ఆశలు తీరంగా... ఆకాశంలో విహారిస్తున్న...
ఆనంద పరవశాన తేలిపోతున్న...
అలా తానంటే పిచ్చి పెంచింది...
ఆ పిచ్చిలో తానే లోకమనుకున్న...
తానులేని క్షణము ఊహించలేకపోతున్నా...
ఎడబాటు ఆరక్షణమైన భరించలేని స్థితిలో నేనున్నా...

ఇలా మాయలెన్నో చేసింది...మలుపులు తిప్పింది....
అవి నీకు చెబుతాను...
ఓ జిలిబిలి వెలుగుల జాబిల్లి...
ఆ కథ వింటావా... సొద అనుకోకా!!

Monday, October 26, 2009

వసంత కాలపు కుసుమాలు... నా కవితా పుష్పాలు...

ఆధునికపు హంగులు నిండిన...
వడి వడి నడకల ఈ యాంత్రిక జీవితం ఇష్టం లేక...
కష్టంగా సాగిస్తున్న ఈ జీవనం లో...
నీ లాంటి ఓ సహోదారుని సహవాసం ఓ ఓదార్పు...
ఆ ఇష్టం లేని జీవనంలో...
నా ఇష్టం కోసం సాగిన అన్వేషణలో...
ప్రభవించిన వసంత కాలపు కుసుమాలు...
ఈ నా కవితా పుష్పాలు...

Saturday, October 24, 2009

శశి కాంతుల చంద్రిక

ఆ శశి కాంతుల చంద్రిక...
ఇలను చేరిందేమో...
నేడు నా ఎదుటకు వచ్చిందేమో...
యన్న సందేహపు సంకెళ్ళను విప్పి...
సాగర తీరపు సంధ్య వేళలు తెచ్చి..
పుత్తడి వెలుగుల పున్నమి నింపిన...
వెచ్చని వెన్నెల కాంతులవి...
ఆమె మెలక సిగ్గుల మోమున విరిసిన...
లేత అధరాల మధుర దరహాసాలు...

మెరిసే ఆ సిరి...
విరిసే ఆ పూ విరి...
కురిసే ఆ తేనెల ఝరి...
ఉన్నాయి ఆ నవ్వులోన...
సరిరావు మరి... ఏ మల్లెల మందహాసాలు...

అవి...
అగుపించని మనసుని అల్లి...
వయసొచ్చిన తనువుని గిల్లి...
తనవైపే చూడమంటున్నాయి....

అది మర్యాద కాదని...
మనసుని అటునుండి మరల్చిన...
వినని చూపులు...
వినయం వీడి...
మరల అటు మరలి...
తన పెదవంచులు తాకి పలకరిస్తున్నాయి...
పలకరించి పరవశాన పులకరిస్తున్నాయి...

నే చేరలేని దూరాన నువ్వున్నా...

నే చేరలేని దూరాన నువ్వున్నా...
నిన్ను చేరే ఆ క్షణం కోసమే...
వేల కన్నులతో నిరీక్షిస్తున్న...
వేయి కరములుసాచి వేచివున్న!!

ఏకాంతపు క్షణాలు...
నీతో గడిపిన గతకాలపు మధురాలను...
గుర్తుకు తెస్తుంటే...
ఈ దూరం బారమౌతుంది...
ఆ బారం భరించలేక నా సగభాగం నీకిచేయ్యాలన్న...
ఆరాటం అధికమౌతున్న తరుణాన...

ప్రతిక్షణం నువ్వు... అనుక్షణం నీ నవ్వు...
క్షణక్షణం నన్ను నీ విరహంలో ముంచివేస్తుంది!!
మరుక్షణం నీ ద్యాసలో నన్ను దాచేస్తుంది!!

Saturday, September 26, 2009

వెదికే నయగారం... వరసై వచ్చిన వేళ!!

వెదికే నయగారం...
వరసై వచ్చిన వేళ...
మనసే మల్లెల హారం...
వయసే వెన్నెల తీరం...

మెరిసే కన్నులలోన...
విరిసే వలపుల కోన!!
మురిసే మదిలోన...
మెదిలే తలపులు చాన!!
అరెరే అనుకున్న...
ఆగిమరిచూస్తున్న!!
ఈ సంగతేంటో ఇలా..
కొత్తగుంది నాలోన!!

ఇది నీవల్లే అనుకున్న.. నీకే నే లొంగిపోతున్న!!
అగలేకపోతున్న... అడ్డుచెప్పక నిల్చున్న!!
తిగల్లె నన్ను అల్లెస్తావో... వరదల్లె ముంచేస్తావో...
అది నీకే వదిలేస్తున్న... నన్ను నీకు అర్పిస్తున్న!!

ఎదసవ్వడి

పలికినది ఎదసవ్వడి తనతోనే లోకమని!!
మురిసినది మది ఆ ఎద అన్నది విని!!
నిలిపినది హృది గుడిలో తన చిరునవ్వుల ప్రతిమని!!
విరిసినది పువ్వుల వని మనసున తననుగని!!
చేరినది తలపుల చెంతకు తనతో సరదాగా సాగమని!!
వలచినది... తనకై వగచినది,తనను చేరే క్షణాలు పెరిగేకొద్ది!!

Friday, September 25, 2009

ఘనీభవించిన స్నేహపు మేఘాన్ని నేను...

మేఘాలు ఉరుముతున్నాయి... కాని వాన లేదు!!
గుండె కొట్టుకుంటుంది... కాని చప్పుడు లేదు!!
పెదవులు కదులుతున్నాయి... కాని పలుకు లేదు!!
ఒంట్లో ఉసురుంది.. కాని ఉలుకు లేదు!!
గడిచిన రోజులో ఎ ఒక్కక్షణం కూడా...
నన్ను జ్ఞప్తికి తేలేదా... మిత్రమా!!

ఘనీభవించిన స్నేహపు మేఘాన్ని నేను...
నీ నులివెచ్చని చెలిమిలో కరిగించు...
వానై కురుస్తాను... ఆనందపువరదనౌతాను!!
శూన్యంలో చూడకు నేస్తమా... ఆ కొట్టుకునే గుండె చప్పుడు వినిపించదు...
ఆ హృది అట్టడుగు పొరల్లో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాల గనిని త్రవ్వి చూడు...
అది చేసే చప్పుడు ఎంత మదురమో!!
కదిలే పెదాల నరాలను తాకిచూడు...
స్వాంతన స్వరాలను మీటుతాయి... స్నేహపుగీతాన్ని ఆలపిస్తాయి!!
ఉలుకు లేదని నువ్వు ఉస్సురుమంటున్న... నీ ఉశ్చ్వాస నిశ్వాసల కదలికలలో నేనున్నా!!
నిన్ను క్షణమైనా మరిస్తే కదా మిత్రమా... మరల గుర్తు చేసుకునేది!!
గతించిన క్షణాల్లోనే కాదు... గమిస్తున్న క్షణాల్లోనూ...
ప్రతిక్షణం నా తలపులలో... అనుక్షణం నా ఆలోచనలలో...
నేను ఒంటరిని కాదంటూ తోడై ఉనావు!!
నే వేసే ప్రతి అడుగుకు విరుల త్రోవైనావు!!

నా దేవేరి నవ్వింది!!

మదనపడే మగతవిడే...
మరులుగోల్పే విరులు చేర్పే..
వడివడి నడకలలో నాట్యం చేరే..
తరుణం వచ్చింది!!
తగువులు తెంచింది!!
తమకం పెంచింది!!

అరుణం అలక వీడింది!!
సంబరం అంబరమంటినది!!
తామరం తలపుల దేవతకు తర్పణమైంది!!

కథై... కవితై...
కలలకు నెలవై...
మది మురిసింది!!
మనసు మందిరాన నా దేవేరి నవ్విన క్షణాన!!

Sunday, September 20, 2009

జీవుడి గమనం!!

జననం భువనం... మరణం గగనం ఐతే...
ఆ రెంటి నడుమ...
ఎంతో పయనముంది... మరెంతో ప్రయాసవుంది!!
ఎంతో జీవనముంది...ఇంకెంతో జీవితముంది!!
ప్రేమలున్నాయి... పోరులున్నాయి!!
కష్టాలున్నాయి... సుఖాలున్నాయి!!
కలతలున్నాయి... కన్నీళ్ళున్నాయి!!
బ్రతుకులున్నాయి... భవితలున్నాయి!!
విటన్నిటిని పెనవేసి...
ఆ చావు-పుట్టుకలను కలిపే సన్నని జీర...
ఈ జీవుడి గమనం!!

ఆరు చక్రాల బండిలో బ్రహ్మమును చేరే దిశలో...
అరిషడ్వర్గాలతో పోరు సలిపి...
వాటికి లొంగిన బీరులు,
బ్రతికున్న విగత జీవులు... గమ్యం మరిచిన గ్రుడ్డి ప్రాణులు!!
వాటినే లొంగదీసిన వీరులు, ధీరులు...
మరణంలోనూ అమరం పొందే దైవులు!!
బ్రహ్మముతో ఐక్యమయ్యే బ్రతుకు జీవులు!!
పరమాత్మలో లీనమైయ్యే అత్మరాములు!!

నా తరళేక్షణ కై అన్వేషణ!!

వయసొచ్చి విరిసిన మనసుని, ముదమున మదనుడు విసిరిన విరుల శరము తగిలినవేళ నుండి...
కవితాసీమలో కలల కౌముదిలో కదిలిన కలహంస చిత్రం!!
ఊహల ఊయలలో ఊరేగిన ఊపిరి ఊహా చిత్రం!!
మగతలో వున్నా మనసుకి మరో జగంలో మెదిలిన మనోజ్ఞ చిత్రం!!
ఆ చిత్త్తరువు చిత్తగించి...
ఇలలో తనకై సాగింది అన్వేషణ ఆ వేళ నుండే..!!

ఆ అన్వేషణలో...
తనకై పరిగెడుతున్న మనసుని పోదివిపట్టలేక పోగొట్టుకున్న!!
వినని మనసుని విడువలేక విచ్చిన్నమౌతున్న!!
ఆ మనసుకై వెదుకాలో... అది వెదికే నా తరుణీ కై వెదుకాలో..
తెలియని సంకట సందిద్గస్థితి!!
ఇరువిరి అన్వేషణ ఇరుకున పెడుతున్న...
ఊరించే ఉడుకు ఊహలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న...
ఏకాకి ఎద ఏకాంతపు వలలో గిలగిలాడుతున్న...
ఒంటరి వయసుని వలపుతలపులు వేదిస్తున్న..
ఆగలేదు... ఆపలేదు...
నా తరళేక్షణ కై అన్వేషణ!!

వేకువ తొలి వెలుగులలో ఆమె జిలుగులు వెదుకుతున్న!!
చీకటి మినుగురుల మినుకువలలో ఆమె కన్నుల కాంతులు వెదుకుతున్న!!
ఆమని ఆగమనం లో ఆమె గమనం వెదుకుతున్న!!
ఆ కడలి కదలికలలో ఆమె నడకలు వెదుకుతున్న!!
సెలయేటి ఆనకట్టులో ఆమె చీరకట్టును వెదుకుతున్న!!
నిశిరాతిరి నీడలో... నిరాచారినై నిరూపణలేని ఆమె రూపునకై వెదుకుతున్న!!
నింగి నిర్జరుడు నిర్దయుడైన... నిర్గమించక...
వేల కోట్ల తారలలో ఆమె తలపుల సితారలకై వెదుకుతున్న!!
నయాగర నడకలలో ఆమె నడుము నయగారముకై వెదుకుతున్న!!
మాఘమాసపు మల్లెల తోటలో ఆమె మేని పరిమళముకై వెదుకుతున్న!!
చలికాలపు చల్లని రేయిలో ఆమె వెచ్చని ఊపిరులకై వెదుకుతున్న!!
ఎంత వెదికిన తెలియకుంది ఎడుందో యా తరుణీ...
ఐన నిదురలేక... మరుపురాక వెదుకుతున్నఆ తరుణంలో...
నాకోసమే వెదుకుతూ వరసై, వదువై వస్తున్న తనని చూసి నిశ్చేష్టుడనవుతున్న!!

Friday, September 11, 2009

మహొన్నతునికి నా కవితాశ్రునివాళి

మరణం కాదది మానవీయతను వీడి మహానీయతను పొందిన యోగమది!!

మరణం కాదది మానసికంగా మనలో అమరం పొందిన బోగమది!!

జనం కొరకు జగం విడిచి జగద్దల్లిని చేరి వరములు కోర తన జీవమునే ముడుపుగట్టుకేల్లిన త్యాగమది!!

స్థూల దేహమున మనలను వీడిన, సూక్ష్మ దేహమున సుస్థిరుడై మనలను నడిపే త్రోవ తానైన తత్వమది!!

భౌతికంగా ఇలను విడిచిన, అభౌతికమై జనుల గుండెల్లో కొలువుదీరిన ప్రత్యూషాశేఖరుడు!!మన రాజశేఖరుడు!!

ఆ మహొన్నతునికి ఇదే నా కవితాశ్రునివాళి!!

ప్రేమ తీరు

ప్రేమ... ఓ ప్రేమ...
ఏమనుకోను... నీ తీరేమనుకోను...!!

గలగలా పారే సేలహేరు అనుకోనా!!
గుండెలోని గమ్మత్తైన గిలిగింతకు పేరు అనుకోనా!!
నీ కన్నా లోకాన ఇంకెవరూ లేరు అనుకోనా!!
ఎద మడిలో వేసిన తలపుల నారు అనుకోనా!!
వయసొచ్చి తెచ్చిన జోరు అనుకోనా!!
మగతై వచ్చి ముంచిన హొరు అనుకోనా!!
ఉడుకు ఊహాల్లో ఊరేగించే తేరు అనుకోనా!!
కనిపించని ప్రాణానికి మారు అనుకోనా!!
మతికి మనసుకి మద్య పోరు అనుకోనా!!
ఊపిరిలో చేరిన వెచ్చని ఊసుల ఊరు అనుకోనా!!

ఏమనుకోను... నిన్నేమనుకోను...!!

Saturday, April 11, 2009

ఓ నా దేవత

నీకోసం మనసున దాచుకున్న ఎన్నో మాటలు...
ఊహల్లో గీసుకున్న ఎన్నో రూపులు...
కలలో చెప్పుకున్న ఎన్నో ఊసులు...
నీకై పెంచుకున్న ఎన్నో ఆశలు...
యవ్వనంలో అడుగిడిన క్షణం నుంచి
ఓ నా దేవత,
నీ కోసమే నా అన్వేషణ...
నీకోసమే నా నిరీక్షణ...

మది కోవెలలో నిన్ను నిలిపి పూజిస్తున్న...
అపురూపంగా... ఆరాద్యంగా...
-హసమ్న

నీ వయసు కాలం ఎదురుచూపు...

గజిబిజి బతుకుల గమనంలో...
నిమిషం నిలువని జీవన పయనంలో...
నిన్ను నువ్వు మరిచిపోయి ఎందుకోసమో అన్వేషణ,

ఒక్కమారు నీ హృది తెరచిచూడు ఓ సరికొత్త లోకం
నీకై వేచివుంది... నిన్ను స్వాగతిస్తుంది.
మమతలు మమకరాలే కోటలుగా...
అనురాగం అనుబందాలే ఆలంబనగా...
నిర్మితమైన అపురూప సుందర దేశం,
నీ మనసు పుట్టిన ప్రదేశం అది...
తనను విడిచి తెలియని తపనతో ఏదో వెదుకులాటలో...
ఎంతో దూరం పయనించావు, తనను మరిచావు...
నీ రాకకోసం, నీ వయసు కాలం ఎదురుచూపు తనది.
-హసమ్న

Tuesday, April 7, 2009

ఓ నిరంతర బాటసారి...

జీవిత పయనం జీవన గమ్యం
తెలియని ఓ నిరంతర బాటసారి...
ఎక్కడ నీ గమ్యం... అది ఎక్కడని ఈ అలుపెరుగని పయనం...

నిమిషం ఆగి,
నిన్ను నువ్వు అన్వేషించు... నీలోని నిన్ను కలుసుకో...
అప్పటికైనా తెలుస్తుంది నీ గమ్యం నీ హృదయమని... నీ పయనం అటు వైపు అని....

Saturday, March 28, 2009

నా నిరీక్షణా...!

కనులు నీకై కలలు కంటుంటే,
మనసు నీకోసం మల్లెల మంచం సిద్దం చేస్తుంటే,
తలపులు హృది తలుపులు తెరిచి నీ రాకను స్వాగతిస్తుంటే,
కొత్త పెళ్లి కూతిరివై నా వలపు వాకిటిలో అడుగేట్టే క్షణాల కోసమే నా నిరీక్షణా...!

నీరాకను స్వాగతిస్తూ... నీకై నిరీక్షిస్తూ..

వలపుల మడిలో తలపుల తడితో,
ఆశల పంట వేసి ఊహాల పూలు పూయించి,
నీ సుకుమార పాదాలు కందకుండ నా హృది గుడికి
దారంతా పరిచాను నీరాకను స్వాగతిస్తూ... నీకై నిరీక్షిస్తూ...!

నీ మీద నా ప్రేమ..!

నా కవిత పదాల పొందికలో నీ కులుకులు దాచుకున్న,
నా కను పాపలలో నీ రూపు దాచుకున్న,
నా కన్నుల వెలుగులలో నీ చిరునవ్వులు దాచుకున్న,
నీ తలపులన్ని నా ఆలోచనలో దాచుకున్న,
నీ తీపి విరహాలు నా నిరీక్షణలో దాచుకున్న,
నీ చిలిపి తగవులు నా చిరునగవులలో దాచుకున్న,
ఇన్ని దాచగలిగిన, నీ మీద నా ప్రేమను దాచలేకపోతున్న....
దాచలేనంత ఆ ప్రేమను నీకే దోచిపెడుతున్న.....!